Page Loader
భారతదేశంలో విడుదలైన Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్
ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో Xiaomi 13 Pro రూ.57,999కే వస్తుంది

భారతదేశంలో విడుదలైన Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 01, 2023
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

Xiaomi తన సరికొత్త స్మార్ట్‌ఫోన్, Xiaomi 13 Proని భారతదేశంలో విడుదల చేసింది. 12GB/256GB కాన్ఫిగరేషన్ ధర రూ.79,999, ఫోన్ అమ్మకాలు మార్చి 10న నుండి ప్రారంభమవుతాయి. మార్కెట్లో ఇది సామ్ సంగ్ Galaxy S23కి పోటీగా ఉంటుంది. ఫోన్ ధర రూ.79,999, అయినా ICICI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా రూ.10,000 తక్షణ తగ్గింపు (HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు రూ. 8,000). అదనంగా, పాత Xiaomi/Redmi ఫోన్‌కు బదులుగా రూ.12,000 తగ్గింపు ఉంటుంది. ఇది IP68-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో, 1.0-అంగుళాల ప్రైమరీ కెమెరా సెన్సార్, LEICA ఇమేజరీని అందిస్తుంది. 12GB LPDDR5X RAM, 256GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

ఫోన్

భారీ తగ్గింపు,ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో Xiaomi 13 Pro రూ. 57,999కే వస్తుంది

4,820mAh బ్యాటరీ, 120W వైర్డ్, 50W వైర్‌లెస్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 5G, డ్యూయల్-సిమ్‌, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, GPS, NFC, టైప్-సి పోర్ట్ ఉన్నాయి. Xiaomi 13 Pro ధర, స్పెసిఫికేషన్‌లను చూస్తే సామ్ సంగ్ Galaxy S23 కంటే మెరుగ్గా ఉంటుంది. Xiaomiలో డాల్బీ విజన్‌తో అధిక రిజల్యూషన్ డిస్‌ప్లే, మెరుగైన ఫ్రంట్, రియర్ కెమెరా, అధిక స్టోరేజ్ తో, పెద్ద బ్యాటరీ ఉంటుంది. భారీ తగ్గింపు,ఎక్స్ఛేంజ్ ఆఫర్ Xiaomi 13 Pro ధరను కేవలం రూ. 57,999కే అందిస్తుంది. iQOO 11, OnePlus 11 వంటి వాటితో పోలిస్తే ఇది మెరుగైన ఆఫర్.