భారతదేశంలో ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కానున్న Xiaomi TV Stick 4K అమ్మకాలు
Xiaomi భారతదేశంలో TV Stick 4Kని ప్రకటించింది. ఇది డాల్బీ టెక్నాలజీ, 4K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ ప్యాచ్‌వాల్ సాఫ్ట్‌వేర్ తో పాటు Wi-Fi 5, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీలతో వస్తుంది. 4K టీవీల అమ్మకాల జోరు పెరుగుతుంది. కస్టమర్‌లు తమ రెగ్యులర్ టెలివిజన్‌లను స్మార్ట్ టీవీలుగా మార్చడానికి Xiaomi, Realme, Amazon, Roku వంటి బ్రాండ్‌లు విడుదల చేసిన 4K స్ట్రీమింగ్ స్టిక్‌లను కొంటున్నారు. Xiaomi TV Stick 4K డాంగిల్ లాంటి డిజైన్‌తో, Mi రిమోట్ తో వస్తుంది, ఇది Netflix, Prime Video మరియు Disney+ Hostar వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల షార్ట్‌కట్‌లను అందిస్తుంది. వాయిస్ సెర్చ్‌ల కోసం రిమోట్‌లో గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంది.
idi MP3, AAC, RM, FLAC వంటి ఆడియో ఫార్మాట్‌లు సపోర్ట్ చేస్తుంది
Xiaomi TV Stick లో HDMI పోర్ట్, మైక్రో-USB పవర్ పోర్ట్ ఉన్నాయి. స్టిక్‌పై ఉన్న వీడియో డీకోడర్‌లలో AV1, VP9, H.265, H.264, MPEG-2, MPEG-1 ఉన్నాయి. JPG, BMP, GIF, PNG వంటి ఇమేజ్ డీకోడర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 8GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. MKV, MPG, MPEG, DAT, AVI, MOV, ISO, MP4, RM వంటి వీడియో ఫార్మాట్లు MP3, AAC, RM, FLAC వంటి ఆడియో ఫార్మాట్‌లు సపోర్ట్ చేస్తుంది. భారతదేశంలో Xiaomi TV Stick 4K ధర రూ. 4,999. ఇది ఫిబ్రవరి 20 నుండి అందుబాటులో ఉంటుంది. అధికారిక Mi e-స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి