Page Loader
Year Ender 2024: ఈ ఏడాది వాట్సాప్ ప‌రిచ‌యం చేసిన ఫీచ‌ర్స్ ఇవే..!
ఈ ఏడాది వాట్సాప్ ప‌రిచ‌యం చేసిన ఫీచ‌ర్స్ ఇవే..!

Year Ender 2024: ఈ ఏడాది వాట్సాప్ ప‌రిచ‌యం చేసిన ఫీచ‌ర్స్ ఇవే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2024
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఇప్పుడు కొత్త ఫీచర్లతో మరింత ఆకట్టుకుంటోంది. మోటా యాజమాన్యంలోని ఈ యాప్‌ను 4 బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లను షేర్ చేస్తున్నారు. వాట్సాప్, యూజర్లకు కొత్త ఎక్స్‌పీరియెన్స్ అందించేందుకు ఎప్పటికప్పుడు ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో ముందంజవేస్తోంది. 2024లో వాట్సాప్‌ పలు కీలక ఫీచర్లను పరిచయం చేసింది, వాటి గురించి తెలుసుకుందాం.

వివరాలు 

మెటా ఏఐ చాట్‌బాట్‌..

ఇది 2024లో మొదటిసారి మెటా ఏఐ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, చిత్రాలను సృష్టించడం వంటి అనేక ఆసక్తికరమైన పనులు చేస్తుంది. టెక్స్ట్ ఇచ్చినట్లయితే, ఏఐ సరిగ్గా, క్వాలిటీతో ఇమేజ్‌ని రూపొందించగలదు. స్టేట‌స్ అప్‌డేట్‌లో ట్యాగ్స్‌, లైక్స్ వాట్సాప్‌ ఇంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లోని లైక్ ఫీచర్‌ లు, ఇప్పుడు వాట్సాప్‌లో కూడా స్టేటస్ అప్‌డేట్‌లకు లైక్స్, ట్యాగ్స్ ఇచ్చే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మనకు నచ్చిన స్టేటస్‌కు లైక్ చేయగలుగుతాం, ఇది వాట్సాప్‌ను మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తోంది.

వివరాలు 

వీడియో కాల్ ఫిల్టర్‌లు 

వీడియో కాల్స్ చేసే వారికి మరింత సరదాగా వీడియో కాల్స్ చేయడానికి కొత్త ఫిల్టర్లను జోడించింది. జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌తో పోటీపడగలిగే ఫీచర్లను వాట్సాప్ తీసుకువచ్చింది. ఇందులో ఏఆర్ కాల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ మార్పులు వంటి అద్భుతమైన ఎంపికలు ఉన్నాయి. వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఇక వాయిస్ మెసేజ్‌లు కూడా ఇప్పుడు టెక్స్ట్‌గా మారుతాయి. మీరు వాయిస్ సందేశాలను వినే స్థితిలో లేనప్పుడు, ఈ ఫీచర్ ద్వారా మీరు వాటిని టెక్స్ట్‌గా చదవగలుగుతారు. ఇది ముఖ్యమైన సమాచారాన్ని రికార్డ్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వివరాలు 

ఇంటర్‌ఫేస్‌లో మార్పులు 

ఇంటర్‌ఫేస్‌లో కూడా మార్పులు తీసుకువచ్చింది. ఈ కొత్త డిజైన్‌ను ఒక చేత్తో ఉపయోగించినా, యూజర్లు సులభంగా అన్ని ట్యాబ్‌ల మధ్య మారవచ్చు. కొత్త అప్‌డేట్‌తో పాటు, కొత్త సింబల్స్ కూడా కనిపిస్తాయి, తద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఫేవ‌రేట్ చాట్‌ ఇంకా, ఫేవరేట్ చాట్స్ అనే కొత్త ఫీచర్ ద్వారా, మీరు తరచుగా వాడే చాట్స్‌ను ముందుగా సెట్ చేసుకోవచ్చు. ఈ కస్టమ్ లిస్ట్ ద్వారా, అవసరమైన చాట్‌ను త్వరగా వెతకవచ్చు, కనుక క‌మ్యూనికేష‌న్ అనుభవం మరింత మెరుగుపడుతుంది.