LOADING...
Google Wallet: గూగుల్ వాలెట్‌లో ఆధార్ కార్డును ఎలా సేవ్ చేయాలి? స్టెప్-బై-స్టెప్ గైడ్
గూగుల్ వాలెట్‌లో ఆధార్ కార్డును ఎలా సేవ్ చేయాలి? స్టెప్-బై-స్టెప్ గైడ్

Google Wallet: గూగుల్ వాలెట్‌లో ఆధార్ కార్డును ఎలా సేవ్ చేయాలి? స్టెప్-బై-స్టెప్ గైడ్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 28, 2026
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో డిజిటల్ ఐడెంటిటీ వినియోగాన్ని మరింత సులభం చేసే దిశగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI)తో భాగస్వామ్యం కుదుర్చుకుని, యూజర్లు తమ ఆధార్ వివరాలను నేరుగా గూగుల్ వాలెట్‌(Google Wallet)యాప్‌లో సేవ్ చేసుకునే సౌకర్యాన్ని అందించింది. ఇకపై ఫిజికల్ కార్డ్ అవసరం లేకుండానే మొబైల్‌లోనే డిజిటల్ ఆధార్ ఉపయోగించి గుర్తింపు, వయస్సు ధృవీకరణ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌లో భాగంగా ఆధార్‌ను "వెరిఫైబుల్ క్రెడెన్షియల్"గా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే,డేటా సెక్యూర్‌గా స్టోర్ అవుతుంది. అవసరమైన సమాచారం మాత్రమే షేర్ అయ్యేలా"సెలెక్టివ్ డిస్క్లోజర్"అనే ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది. పూర్తి ఆధార్ వివరాలు చూపకుండా వయస్సు మాత్రమే కన్ఫర్మ్ చేయవచ్చు. ఇది యూజర్ల ప్రైవసీని కాపాడుతుంది.

వివరాలు 

భాగస్వామ్య ప్లాట్‌ఫార్మ్‌లలో పనిచేస్తున్న ఈ ఫీచర్

పీవీఆర్‌ ఐనాక్స్‌, భారత్‌ మ్యాట్రిమొనీ వంటి వేదికల్లో దీన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. మైగేట్‌, స్నాబిట్‌ వంటి ఇతర వేదికలకూ త్వరలో ఈ వెరిఫికేషన్‌ సదుపాయాన్ని విస్తరిస్తామని తెలిపింది.

వివరాలు 

గూగుల్ వాలెట్‌లో ఆధార్ ఎలా సేవ్ చేయాలి?

ముందుగా మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి: 1. మీ ఫోన్‌లో Google Wallet యాప్ లేటెస్ట్ వెర్షన్‌లో ఉందో చూసుకుని,అవసరమైతే అప్డేట్ చేయండి. 2. యాప్ ఓపెన్ చేసి"Add to Wallet" లేదా "+"బటన్‌పై ట్యాప్ చేయండి. 3. ID పాస్ లేదా ఆధార్ కార్డ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. 4. UIDAI పోర్టల్ ద్వారా OTP వెరిఫికేషన్ చేయాలి. 5. లేకపోతే, అప్డేట్ అయిన UIDAI ఆధార్ యాప్‌లో క్రెడెన్షియల్ క్రియేట్ చేసి"Share ID" ద్వారా వాలెట్‌కు పంపవచ్చు. 6. ప్రక్రియ పూర్తయిన తర్వాత,మీ ఆధార్ డిజిటల్ రూపంలో సెక్యూర్‌గా సేవ్ అవుతుంది. ఫోన్ లాక్ లేదా బయోమెట్రిక్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలరు.

Advertisement