Loading...
YouTube: 'Ask YouTube'కు భారీ ఆదరణ.. కొత్త షాపింగ్‌ ఫీచర్లు తీసుకొచ్చిన యూట్యూబ్
'Ask YouTube'కు భారీ ఆదరణ.. కొత్త షాపింగ్‌ ఫీచర్లు తీసుకొచ్చిన యూట్యూబ్

YouTube: 'Ask YouTube'కు భారీ ఆదరణ.. కొత్త షాపింగ్‌ ఫీచర్లు తీసుకొచ్చిన యూట్యూబ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూట్యూబ్‌ తన 'Ask YouTube' ఏఐ సెర్చ్‌ ఫీచర్‌ను మరింత విస్తరించేందుకు షాపింగ్‌ సహాయకుడిని తీసుకొస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సంభాషణాత్మక సెర్చ్‌ సదుపాయం ఇప్పుడు యూట్యూబ్‌లో కీలక ఫీచర్‌గా మారుతోంది. సాధారణ సెర్చ్‌ పదాలకు బదులుగా వినియోగదారులు సహజమైన భాషలో, క్లిష్టమైన ప్రశ్నలను కూడా అడిగి సమాధానాలు పొందొచ్చు. ప్రయాణ ప్రణాళికలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటి అంశాలపై షార్ట్స్‌, లాంగ్‌ ఫార్మాట్‌ వీడియోలను కూడా సెర్చ్‌ ఫలితాల్లో చూడొచ్చు.

వివరాలు 

కొనుగోలుపై స్పష్టమైన నిర్ణయాలకు..

'Ask YouTube' సామర్థ్యాలను ఇప్పుడు షాపింగ్‌ కోసం కూడా విస్తరిస్తోంది.

ఉదాహరణకు ఒక నిర్దిష్ట ఉత్పత్తి గురించి సెర్చ్‌ చేస్తే.. వినియోగదారుడి అవసరాలకు అనుగుణంగా వివిధ ఉత్పత్తులను పోల్చే పట్టికలు, వాటి ఫీచర్లు, విభాగాల వారీగా సిఫార్సులు అందించవచ్చు.

దీంతో తాము చూస్తున్న వీడియోల నుంచే ఉత్పత్తుల గురించి మరింత వివరంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

వివరాలు 

'Ask YouTube'కు భారీ ఆదరణ..

'Ask YouTube' వినియోగం భారీగా పెరిగిందని యూట్యూబ్‌ తెలిపింది.

ఒక్క జూన్‌ నెలలోనే 14 కోట్లకు పైగా మంది ఈ ఫీచర్‌ను ఉపయోగించారు.

గత ఏడాది డిసెంబరుతో పోలిస్తే ఇది 500 శాతానికి పైగా పెరుగుదల.

కస్టమ్‌ జెమినీ మోడల్‌ సాయంతో ప్రేక్షకులు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు సంబంధించిన వీడియోల్లోని నిర్దిష్ట భాగాలను ఈ ఫీచర్‌ గుర్తిస్తుంది.

తద్వారా ప్రేక్షకులను నేరుగా సంబంధిత కంటెంట్‌, దాన్ని రూపొందించిన క్రియేటర్లతో అనుసంధానిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్లు..

షాపింగ్‌ సహాయకుడితో పాటు క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ పలు కొత్త సదుపాయాలను ప్రకటించింది.

వీడియో తయారీలో ఐడియా ఆలోచించడం, ఫుటేజ్‌ ఎడిటింగ్‌, కామెంట్ల నిర్వహణ, క్రియేటర్ల వ్యక్తిగత గుర్తింపును రక్షించడం వరకు వివిధ దశల్లో ఇవి ఉపయోగపడనున్నాయి.

'Ask YouTube' సంభాషణాత్మక సెర్చ్‌లో షాపింగ్‌ సదుపాయాలను తీసుకురావడంతో పాటు షార్ట్స్‌ కోసం కొత్త సిరీస్‌ ఫార్మాట్‌ను కూడా యూట్యూబ్‌ పరిచయం చేస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

రీసెర్చ్‌, ఎడిటింగ్‌కు కొత్త టూల్స్‌..

క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ స్టూడియోలో రీసెర్చ్‌, ఎడిటింగ్‌, ఛానల్‌ నిర్వహణకు ఉపయోగపడే కొత్త టూల్స్‌ను కూడా అందిస్తోంది.

కొత్తగా తీసుకొస్తున్న 'Insights', 'Research' విభాగాల ద్వారా గతంలో చేసిన వీడియోల పనితీరును క్రియేటర్లు తెలుసుకోవచ్చు.

ఇతర వీడియోల కంటే భిన్నంగా ఎక్కువగా ఆదరణ పొందిన కంటెంట్‌ను గుర్తించి, భవిష్యత్‌లో కొత్త వీడియోల తయారీకి ఐడియాలను పొందొచ్చు.

డ్రాఫ్ట్‌ వీడియోల విషయంలో వేగం, నిర్మాణం, కథన విధానంపై వ్యక్తిగత సూచనలను యూట్యూబ్‌ స్టూడియో అందిస్తుంది.

వివరాలు 

ఏ/బీ టెస్టింగ్‌.. జెమినీతో ఎడిటింగ్‌..

వీడియోల ప్రారంభ భాగాల్లో ఏది ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో తెలుసుకునేందుకు యూట్యూబ్‌ కొత్తగా వీడియో ఏ/బీ టెస్టింగ్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది.

దీని ద్వారా క్రియేటర్లు ఒకే వీడియోకు మూడు వరకు వేర్వేరు కట్స్‌ను పరీక్షించవచ్చు.

అలాగే షార్ట్స్‌, 'YouTube Create' యాప్‌లో సంభాషణాత్మక ఎడిటింగ్‌ అసిస్టెంట్‌గా జెమినీని తీసుకొస్తోంది.

క్రియేటర్లు యూట్యూబ్‌ సూచించే ప్రాంప్ట్‌లతో లేదా తమ సొంత సూచనలతో ఎడిటింగ్‌ ప్రారంభించవచ్చు.

చాట్‌ ద్వారా ఫ్రేమ్‌ల క్రమాన్ని మార్చడం, క్లిప్‌లను కత్తిరించడం, సంగీతాన్ని వీడియోకు సరిపోయేలా సింక్‌ చేయడం వంటి పనులు చేసి.. ఆ తర్వాత మళ్లీ సాధారణ టైమ్‌లైన్‌ ఎడిటింగ్‌కు మారవచ్చు.

ADVERTISEMENT