YouTube Premium Lite: యూట్యూబ్‌లో వీడియోలను ప్రకటనలు లేకుండా చూసేందుకు.. యూట్యూబ్ ప్రీమియం లైట్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్‌కు చెందిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) తన ప్రీమియం వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా, యాడ్-ఫ్రీ కంటెంట్‌ను మరింత అందుబాటు ధరలో అందించేందుకు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
'యూట్యూబ్ ప్రీమియం లైట్' పేరిట ఈ కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది.
ఈ ప్లాన్‌ను పొందిన వినియోగదారులకు ఎక్కువ వీడియోలు ప్రకటనల రహితంగా వీక్షించే అవకాశం కలుగుతుందని యూట్యూబ్ ప్రకటించింది.
వివరాలు
ఈ ప్లాన్ ధర 7.99 డాలర్లు
ప్రస్తుతం, ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కేవలం అమెరికా మార్కెట్‌కే పరిమితం చేసింది.
అయితే, త్వరలోనే మరిన్ని దేశాలకు దీన్ని విస్తరించే యోచనలో ఉందని వెల్లడించింది.
ఈ ప్లాన్ ధరను 7.99 డాలర్లుగా నిర్ణయించింది, కాగా, ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రీమియం ప్లాన్ ధర 13.99 డాలర్లుగా ఉంది.
ఇక, సాధారణ యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌లో యాడ్-ఫ్రీ వీడియోలతో పాటు, యాడ్-ఫ్రీ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, డౌన్‌లోడ్ వంటి అదనపు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
అయితే, లైట్ ప్లాన్‌లో మాత్రం కేవలం యూట్యూబ్ వీడియోలను యాడ్స్ లేకుండా చూడగలిగే సదుపాయం మాత్రమే లభిస్తుంది.
మరిన్ని ఫీచర్లు కావాలంటే, వినియోగదారులు రెగ్యులర్ ప్రీమియం ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి.
వివరాలు
భారతదేశంలో ఈ కొత్త ప్లాన్‌పై స్పష్టత లేదు
అయితే, "చాలా వీడియోలు యాడ్-ఫ్రీగా ఉంటాయని" యూట్యూబ్ ప్రకటించినప్పటికీ, కొన్ని వీడియోల్లో ప్రకటనలు కనిపించే అవకాశం ఉంది.
ప్రస్తుతం అమెరికాలో ప్రారంభించిన ఈ ప్లాన్‌ను, మరికొన్ని వారాల్లో ఆస్ట్రేలియా, జర్మనీ, థాయ్‌లాండ్ దేశాలకు విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది.
భారతదేశంలో ఈ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురానుందా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
ప్రస్తుతం భారత మార్కెట్లో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ నెలకు రూ.159, ఏడాదికి రూ.1490గా ఉంది. ఇక, ఫ్యామిలీ ప్యాక్‌ను ఎంచుకుంటే నెలకు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది.