LOADING...
YouTube's first video: డిజిటల్ ప్రపంచాన్ని మార్చిన తోలి యూట్యూబ్ వీడియోకు చారిత్రక గుర్తింపు
డిజిటల్ ప్రపంచాన్ని మార్చిన తోలి యూట్యూబ్ వీడియోకు చారిత్రక గుర్తింపు

YouTube's first video: డిజిటల్ ప్రపంచాన్ని మార్చిన తోలి యూట్యూబ్ వీడియోకు చారిత్రక గుర్తింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్ ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచిన యూట్యూబ్ తొలి వీడియో ఇప్పుడు మ్యూజియంలో స్థానం సంపాదించింది. లండన్‌లోని Victoria and Albert Museum (వి & ఎ) తమ సేకరణలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన మొట్టమొదటి వీడియోను చేర్చింది. "Me at the zoo" అనే పేరుతో ఉన్న ఈ 19 సెకన్ల వీడియోను యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు Jawed Karim 2005 ఏప్రిల్ 23న అప్‌లోడ్ చేశారు. ఇందులో యువకుడైన కరీమ్ సాన్ డియాగో జూలో ఏనుగుల గురించి మాట్లాడుతుంటాడు. ఈ చిన్న వీడియో ఇప్పటివరకు 382 మిలియన్లకు పైగా వీక్షణలు, 18 మిలియన్లకు పైగా లైక్‌లు సంపాదించింది.

వివరాలు 

సైట్ పునర్నిర్మాణం

ఇదే కాకుండా, ఈ వీడియోతో పాటు ఆ కాలంలోని యూట్యూబ్ వెబ్‌సైట్ రూపాన్ని కూడా మళ్లీ సృష్టించారు. 2006 డిసెంబర్ 8న ఉన్న యూట్యూబ్ డిజైన్, వినియోగదారుల అనుభవాన్ని తిరిగి రూపొందించడానికి వి & ఎ డిజిటల్ సంరక్షణ బృందం దాదాపు 18 నెలలు శ్రమించింది. ఈ ప్రాజెక్ట్‌ను యూట్యూబ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ టీమ్,లండన్‌కు చెందిన OIO డిజైన్ స్టూడియోతో కలిసి చేపట్టారు. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ మాట్లాడుతూ, ఇది కేవలం ఒక వీడియోను ప్రదర్శించడం మాత్రమే కాదని, ప్రపంచ సాంస్కృతిక విప్లవానికి ఆరంభమైన క్షణాన్ని మళ్లీ అనుభవించే అవకాశం కల్పించడమేనని చెప్పారు.

వివరాలు 

ప్రాజెక్టు ప్రాముఖ్యత

వీ & ఎ సీనియర్ క్యురేటర్ కొరిన్నా గార్డనర్ (Corinna Gardner) ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యాన్ని వివరించారు. వెబ్ 2.0 ప్రారంభ దశలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఇది ప్రతిబింబిస్తుందని, ఇంటర్నెట్ చరిత్రలోనూ, డిజిటల్ డిజైన్ అభివృద్ధిలోనూ ఇది ఒక కీలక అధ్యాయమని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ తొలి యూట్యూబ్ వీడియోను వి & ఎ సౌత్ కెన్సింగ్టన్‌లోని డిజైన్ 1900-నౌ గ్యాలరీలో ప్రజల కోసం ప్రదర్శిస్తున్నారు.

Advertisement