YouTube: క్లికబుల్ థంబ్‌నైల్స్, టైటిల్స్ పెట్టేవారి కోసం త్వరలో యూట్యూబ్ కొత్త నిబంధనలు
ఎక్కువ వ్యూస్ సాధించడానికి కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే థంబ్‌నైల్స్, టైటిల్స్ ఉపయోగించడం పెరిగిపోయింది. ఈ వీడియోలకు సంబంధం లేని టైటిల్స్ ఉంచి, వాటిలో ప్రదర్శించిన అంశాలు అసలు విషయానికి సంబంధించవు. ఉదాహరణకు, ఒక సినిమాను చూపిస్తూ, అదే విషయంతో సంబంధం లేని వీడియోను లోపల పెడతారు. సెలబ్రిటీలు, రాజకీయ నేతల పేర్లతో కేవలం క్లిక్‌బైట్ టెక్నిక్‌ను ఉపయోగించి థంబ్‌నైల్స్ క్రియేట్ చేస్తారు, కానీ వీడియోలో అలాంటి విషయాలు ఉండవు. ఈ తప్పుదోవ పట్టించే చర్యలు చూసిన యూజర్లు అనేకసార్లు విసుగెత్తిపోతున్నారు. దీనితో, సమయం వ్యర్థమవ్వడమే కాకుండా, ప్లాట్‌ఫారమ్‌పై విశ్వాసం కూడా తగ్గిపోతోంది. ఈ కారణంగా, యూట్యూబ్ ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ముందుకొచ్చింది.
నిబంధనలను పాటించడానికి క్రియేటర్లకు సమయం
ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్, తాజా వార్తల విషయంలో ఈ తరహా క్లిక్ బైట్ టైటిల్స్, థంబ్‌నైల్స్ మరింత ఎక్కువగా ఉపయోగం అవుతున్నాయి. దీనిని అడ్డుకునేందుకు యూట్యూబ్ త్వరలో కొత్త నిబంధనలను తీసుకురాబోతుంది. ఈ నిబంధనలను పాటించడానికి క్రియేటర్లకు సమయం ఇవ్వనుంది. అయితే, ఈ నిబంధనలను ఉల్లంఘించిన వీడియోలను తొలగిస్తుంది. ఒకవేళ మళ్లీ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఛానల్‌పై స్ట్రైక్ (strikes) వేస్తుంది. ముఖ్యంగా, భారత్‌లో ఈ తరహా తప్పుదోవ పట్టించే వీడియోల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ ప్రకటించింది.