Loading...
Temple Device: టెంపుల్‌ డివైజ్‌పై వస్తున్న విమర్శలకు చెక్.. దీపిందర్‌ గోయల్‌ క్లారిటీ
టెంపుల్‌ డివైజ్‌పై వస్తున్న విమర్శలకు చెక్.. దీపిందర్‌ గోయల్‌ క్లారిటీ

Temple Device: టెంపుల్‌ డివైజ్‌పై వస్తున్న విమర్శలకు చెక్.. దీపిందర్‌ గోయల్‌ క్లారిటీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 09, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ రూపొందించిన Temple wearable deviceపై వస్తున్న విమర్శలకు ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ పరికరాన్ని వైద్య పరికరంగా ప్రచారం చేయలేదని, తాము ఎలాంటి మెడికల్ క్లెయిమ్ చేయలేదని స్పష్టం చేశారు. దీపావళి సందర్భంగా Xలో చేసిన పోస్టులో గోయల్‌.. Temple అనేది ప్రధానంగా ఫిట్‌నెస్ + AI డివైజ్ అని చెప్పారు. ఇది ఏదైనా వ్యాధిని గుర్తిస్తుందని, నివారిస్తుందని నిరూపితం కాలేదని తెలిపారు. అలాగే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరాన్ని ఈ పరికరం భర్తీ చేయదని చెప్పారు. అందువల్ల Templeను కొనుగోలు చేసే ముందు దాని పరిమితులను వినియోగదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలని గోయల్‌ సూచించారు.

Details

భారత్‌ కోసం కాదు.. ప్రపంచ మార్కెట్‌ టార్గెట్

Temple ధరపై కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. దీనిపై గోయల్‌ మాట్లాడుతూ.. ఈ పరికరాన్ని భారత మార్కెట్‌ కోసం మాత్రమే తయారు చేయలేదని, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని చెప్పారు.

భారత్‌లో విక్రయమయ్యే Temple పరికరాల సంఖ్య మొత్తం అమ్మకాల్లో 1 శాతానికి మించకపోవచ్చని ఆయన అంచనా వేశారు.

ధర ఎక్కువగా ఉందని భావిస్తే వెంటనే కొనాల్సిన అవసరం లేదని, ముందుగా యూజర్‌ రివ్యూలు చూసి నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.

భారతీయ స్టార్టప్‌ అనే కారణంతో మాత్రమే మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని, కొత్త ఆవిష్కరణలపై నమ్మకం ఉంటేనే మద్దతు ఇవ్వాలని గోయల్‌ అన్నారు.

Details

Brain Flow మాత్రమే కాదు.. అసలు టార్గెట్‌ Entropy

Temple గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా గోయల్‌ వెల్లడించారు.

చాలామంది ప్రస్తుతం Brain Flow గురించి చర్చిస్తున్నప్పటికీ, అది Temple ప్రధాన ఉద్దేశం కాదన్నారు.

Brain Flowపై పరిశోధనలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని చెప్పారు. Templeలో అసలు కీలకమైన అంశం Entropy అని వివరించారు.

దీనిపై ఇప్పటివరకు పూర్తి వివరాలను బయటపెట్టలేదని, త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

అలాగే Roomdeaf AI అనేది పరికరం సామర్థ్యాలను మరింత విస్తరించేందుకు రూపొందించిన భాగమే తప్ప, Temple దిశను మార్చే ప్రయత్నం కాదని స్పష్టం చేశారు.

Brain Flowను ఎలా లెక్కిస్తారు, దాని ఉపయోగాలు ఏమిటి, ముఖ్యంగా దాని పరిమితులు ఏంటనే విషయాలపై త్వరలో ప్రత్యేక వివరణ ఇస్తానని గోయల్‌ తెలిపారు.

ADVERTISEMENT