Page Loader
Ravichandran Ashwin: షారుక్ ఖాన్ కోసం గుజరాత్ టైటాన్స్ పోటీ పడే ఛాన్స్ : రవిచంద్రన్ అశ్విన్
షారుక్ ఖాన్ కోసం గుజరాత్ టైటాన్స్ పోటీ పడే ఛాన్స్ : రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: షారుక్ ఖాన్ కోసం గుజరాత్ టైటాన్స్ పోటీ పడే ఛాన్స్ : రవిచంద్రన్ అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 29, 2023
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ (IPL) 2024 వేలం నేపథ్యంలో హర్థిక్ పాండ్యా(Hardik Pandya) ఫ్రాంఛేజీ మార్పు గురించి క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా విజయవంతంగా కొనసాగుతున్న ఈ స్టార్ ఆల్ రౌండర్ ఉన్నట్టుండి ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి చేయడం సంచలనంగా మారింది. రూ.15 కోట్ల విలువైన ఆటగాడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ట్రేడింగ్ గా నిలిచింది. హార్ధిక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు గుజరాత్ యాజమాన్యం ఏం చేస్తుందో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో షారుక్ ఖాన్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశాడు.

Details

షారుక్ ఖాన్ కు 12 నుంచి 13 కోట్లు చెల్లించవచ్చు : అశ్విన్

ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఈ వేలంలో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడే ఛాన్స్ ఉంది. షారుక్ ఖాన్ 2022 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 165.96 స్ట్రైక్ రేట్‌తో 156 పరుగులు చేశాడు. కచ్చితంగా షారుక్ ఖాన్ కోసం చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటిపడతాయని అశ్విన్ పేర్కొన్నారు. షారుక్ ఖాన్ వేలంలో రూ.12 నుంచి 13 కోట్ల వరకు వెళ్లవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక షారుక్ ఖాన్ పొందేందుకు సీఎస్కే మిచెల్ స్కార్క్ ను వదిలే అవకాశం కూడా ఉందని అశ్విన్ చెప్పాడు.