Loading...
2027 odi world cup qualifier: 2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం
2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం

2027 odi world cup qualifier: 2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 06, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించే జట్లను ఎంపిక చేసే క్వాలిఫయర్‌ టోర్నీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం, మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను ఇంకా వెల్లడించలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు మాత్రమే పోటీపడగా, 2027 టోర్నీలో జట్ల సంఖ్యను 14కు పెంచారు. వీటిలో 10 జట్లు నేరుగా ప్రపంచకప్‌లో స్థానం దక్కించుకోగా, మిగిలిన నాలుగు జట్లు క్వాలిఫయర్‌ పోటీల ద్వారా ఎంపికవుతాయి.

వివరాలు

అగ్రస్థానంలో నిలిచిన ఒక్క జట్టు..

క్వాలిఫయర్‌ టోర్నీలో 11వ స్థానంలో నిలిచే జట్టు నేరుగా ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలోకి ప్రవేశిస్తుంది.

ఇక 12వ, 13వ, 14వ స్థానాల్లో నిలిచిన జట్లు గ్రూప్‌ దశకు ముందు నిర్వహించే 'సూపర్‌ సిరీస్‌' రౌండ్‌లో పోటీపడాల్సి ఉంటుంది.

ఈ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఒక్క జట్టుకు మాత్రమే గ్రూప్‌ దశలో ఆడే అవకాశం లభిస్తుంది.

ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.

ప్రతి గ్రూప్‌ నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు, అదనంగా నాలుగో అత్యుత్తమ జట్టు కలిసి 'సూపర్‌-7' దశకు అర్హత సాధిస్తాయి.

ఈ దశలో రౌండ్‌ రాబిన్‌ విధానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.

వివరాలు

2027 ప్రపంచకప్‌కు సంయుక్త ఆతిథ్య దేశాలు ఇవే..

2027 ప్రపంచకప్‌కు సంయుక్త ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా ప్రవేశం లభిస్తుంది.

అయితే అసోసియేట్‌ సభ్య దేశమైన నమీబియా మాత్రం క్వాలిఫయర్‌ టోర్నీలో పాల్గొని అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలను మినహాయించి, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత పొందుతాయి.

ADVERTISEMENT