Loading...
SRH: వరుసగా 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. కావ్య మారన్ ప్లేయర్ రంజీల్లో రికార్డుల వేట!
వరుసగా 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. కావ్య మారన్ ప్లేయర్ రంజీల్లో రికార్డుల వేట!

SRH: వరుసగా 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. కావ్య మారన్ ప్లేయర్ రంజీల్లో రికార్డుల వేట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2026
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో పలువురు భారత క్రికెటర్లు బ్యాట్, బంతితో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఐపీఎల్ 2026లో ఆడిన యువ క్రికెటర్ సలీల్ అరోరా (Salil Arora) పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సలీల్.. నాలుగు శతకాలతో అదరగొట్టాడు.

వివరాలు

నాలుగు మ్యాచ్‌లు.. వరుసగా నాలుగు సెంచరీలు

ఈ రంజీ సీజన్‌లో సలీల్ అరోరా తన అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు అతడు సాధించిన నాలుగు సెంచరీల వివరాలు ఇలా ఉన్నాయి.

అస్సాంతో మ్యాచ్: ఈ సీజన్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 110 పరుగులు సాధించాడు.

ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్: రెండో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 107 పరుగులతో జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

హైదరాబాద్‌తో మ్యాచ్: ఈ పోరులో మరింత దూకుడుగా ఆడిన సలీల్.. 151 పరుగులు చేశాడు. ఇది అతడి ఫస్ట్ క్లాస్ కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

ఆంధ్రతో మ్యాచ్: తాజాగా వరుసగా నాలుగో సెంచరీని నమోదు చేశాడు.

వివరాలు

ఫస్ట్ క్లాస్ కెరీర్‌లోనూ ఆకట్టుకునే గణాంకాలు

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 186 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు.

సలీల్ అరోరా 2024లో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడాడు. 55.73 సగటుతో 836 పరుగులు సాధించాడు.

ఇందులో నాలుగు సెంచరీలతో పాటు మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజా రంజీ సీజన్‌లో వరుసగా నాలుగు శతకాలు సాధించడంతో అతడి ఫామ్‌పై చర్చ మొదలైంది.

ADVERTISEMENT

వివరాలు

ఐపీఎల్ 2026లో ఎలా ఆడాడంటే?

ఐపీఎల్ మినీ వేలంలో కావ్య మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సలీల్ అరోరాను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో అతడికి 14 మ్యాచ్‌ల్లో అవకాశం లభించింది. అయితే 11 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన సలీల్.. మొత్తం 156 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ.. ఇప్పుడు రంజీ ట్రోఫీలో మాత్రం తన బ్యాటింగ్ సత్తా చాటుతున్నాడు.

వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ADVERTISEMENT