Shafali Verma: పవర్‌ప్లేలో సిక్స్‌ల మోత.. ఊపిరి పీల్చుకోవడమే కష్టమైందన్న షఫాలీ!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు (Team India In Asia Cup Final) ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై షఫాలీ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. మిగతా బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడిన పిచ్‌పై షఫాలీ మాత్రం భారీ షాట్లతో చెలరేగింది. బంగ్లాదేశ్ ఫీల్డర్లు క్యాచ్‌లను వదిలేయడం కూడా షఫాలీకి కలిసొచ్చింది. అయితే, పవర్ ప్లేలో తన పని భారీ షాట్లు కొట్టడమేనని షఫాలీ వర్మ తెలిపింది.
వివరాలు
'పవర్ ప్లేలో ఎక్కువ సిక్స్‌లు కొట్టడమే నా పని'
''ఇక్కడి వాతావరణం చాలా ఉక్కపోతగా అనిపించింది.
ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. అందుకే బంతిని ఎదుర్కోని సమయంలో ఒకేసారి ఎక్కువగా గాలిని పీల్చి వదలడం చేస్తుండేదానిని. క్రీజ్‌లోకి వచ్చాక మాత్రం భారీ షాట్లు కొట్టేందుకే ప్రయత్నించా. పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ సిక్స్‌లు కొట్టడమే నా పని.
మా జట్టు వ్యూహం కూడా అదే. తొలి ఆరు ఓవర్లలో కాస్త ఎక్కువ పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది.
దానిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించా'' అని షఫాలీ వెల్లడించింది.
వివరాలు
ఫీల్డింగ్‌పై మాకెలాంటి ఆందోళన లేదు: దీప్తి శర్మ
వరుసగా అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచినప్పటికీ.. భారత ఫీల్డింగ్ మాత్రం గొప్పగా లేదు. సెమీఫైనల్లోనూ బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇచ్చిన పలు క్యాచ్ అవకాశాలను టీమ్‌ఇండియా ఫీల్డర్లు జారవిడిచారు.
దీనిపై దీప్తి శర్మ స్పందించింది. 'జట్టుగా మేం ఫీల్డింగ్‌పైనా కసరత్తు చేస్తున్నాం. నెట్ సెషన్‌లోనూ ఎక్కువగా క్యాచ్‌లను ప్రాక్టీస్ చేస్తున్నాం. ఒక్కో రోజు ఎంత కష్టపడినా కలిసిరాదు. తప్పకుండా ఫైనల్‌లో గొప్ప ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం.
తుది పోరులో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంటాం. ఫైనల్‌లో ప్రత్యర్థి ఎవరైనా సరే మాకు పట్టింపు లేదు.
ఏ జట్టునూ తేలికగా తీసుకోం. శ్రీలంక లేదా పాకిస్థాన్ ఏ టీమ్ వచ్చినా సమష్టిగా రాణించి కప్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తామని దీప్తి శర్మ (Deepti Sharma) వెల్లడించింది.
వివరాలు
తెలుగమ్మాయి శ్రీ చరణి రికార్డు
తెలుగు మహిళా క్రికెటర్ శ్రీ చరణి (Sree Charani) అద్భుత రికార్డు సృష్టించింది. భారత్ తరఫున అత్యంత వేగంగా టీ20ల్లో 50 వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించింది. కేవలం 29 మ్యాచ్‌ల్లోనే ఆమె 50 వికెట్ల మైలురాయిని అందుకుంది.
ఈ క్రమంలో పురుషుల, మహిళల భారత క్రికెట్‌లో కుల్‌దీప్ యాదవ్‌ను అధిగమించి శ్రీ చరణి ముందుకు దూసుకొచ్చింది.
ఆసియా కప్ సెమీఫైనల్లోనూ బంగ్లాదేశ్‌పై శ్రీ చరణి సత్తాచాటింది. 4 ఓవర్లు వేసిన ఆమె 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది.