Page Loader
ద్యుతీ చంద్ కు భారీ షాక్.. డోప్ టెస్టులో విఫలమైనందుకు నాలుగేళ్లు నిషేధం
ద్యుతీ చంద్ కు భారీ షాక్.. డోప్ టెస్టులో విఫలమైనందుకు నాలుగేళ్లు నిషేధం

ద్యుతీ చంద్ కు భారీ షాక్.. డోప్ టెస్టులో విఫలమైనందుకు నాలుగేళ్లు నిషేధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2023
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశా రాష్ట్రానికి చెందిన భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ కు భారీ షాక్ తగిలింది. డోప్ టెస్టులో విఫలమైనందుకు ఆమెపై డోపింగ్ ప్యానెల్ నాలుగేళ్లు నిషేధం విధించింది. నిషేధిత ' సెలెక్టివ్ ఆండ్రోజన్ రిసెప్టార్ మాడ్యులేటర్స్' ను ద్యుతి తీసుకున్నట్లు గతేడాది డిసెంబర్‌లో నాడా నిర్వహించిన డోప్ పరీక్షల్లో తేలింది. ఈ నిషేధం 2023 జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. 21 రోజులలోపు తనపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ద్యుతీచంద్‌ రివ్యూ పిటిషన్‌ వేసుకోవచ్చని తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని వందలసార్లు డోపింగ్‌ టెస్టులు ఎదుర్కొని కడిగిన ఆణిముత్యంలా ద్యుతి తిరిగొచ్చిందని, ఈసారి కూడా అలానే జరుగుతుందని సదరు న్యాయవాది ద్యుతిపై నమ్మకం ఉంచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ద్యుతీ చంద్ పై నాలుగేళ్లు నిషేధం