Loading...
Asian Games: కబడ్డీలో భారత్‌కు డబుల్ బొనాంజా.. అమ్మాయిల బాటలో అబ్బాయిలూ పసిడి పట్టేశారు!
కబడ్డీలో భారత్‌కు డబుల్ బొనాంజా.. అమ్మాయిల బాటలో అబ్బాయిలూ పసిడి పట్టేశారు!

Asian Games: కబడ్డీలో భారత్‌కు డబుల్ బొనాంజా.. అమ్మాయిల బాటలో అబ్బాయిలూ పసిడి పట్టేశారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 26, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల కబడ్డీలో భారత అమ్మాయిలు, అబ్బాయిలు ఇరాన్‌ను గట్టిగా ఎదుర్కొన్నారు. ఇప్పటికే ఇరాన్‌ను ఓడించి మహిళల జట్టు స్వర్ణ పతకాన్ని సాధించగా.. పురుషుల జట్టు కూడా అదే బాటలో నడిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్‌ పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్‌ను 40-34 పాయింట్ల తేడాతో ఓడించింది. దీంతో ఆసియా క్రీడల చరిత్రలో భారత కబడ్డీ జట్టు సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య తొమ్మిదికి చేరింది. 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణ పతకం.

వివరాలు

పతకాల పట్టికలో భారత్‌కు 10వ స్థానం

2026 ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలతో భారత్‌ పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది.

నాలుగు స్వర్ణాలతో పాటు 11 రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించింది. మొత్తంగా భారత్‌ ఖాతాలో 28 పతకాలు ఉన్నాయి.

మహిళల క్రికెట్‌ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సేన అద్భుత విజయాన్ని నమోదు చేసి భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.

ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సురుచి సింగ్, కమల్‌జీత్‌ జంట శుక్రవారం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

ఇక శనివారం కబడ్డీలో భారత్‌కు ఏకంగా రెండు స్వర్ణ పతకాలు లభించాయి.

వివరాలు

గత ఆసియా క్రీడల్లో 106 పతకాలు

2022 ఆసియా క్రీడల్లో భారత్‌ మొత్తం 106 పతకాలను సాధించింది.

ఇందులో 28 స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఈసారి పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో నిలవగా.. చైనా అగ్రస్థానంలో కొనసాగింది.

2026 ఆసియా క్రీడల్లో కబడ్డీలో మహిళలతో పాటు పురుషుల జట్టు కూడా స్వర్ణం సాధించడంతో.. ఈ క్రీడాంశంలో భారత ఆధిపత్యం మరోసారి కొనసాగింది.

ADVERTISEMENT