KL Rahul: భావోద్వేగంతో కేఎల్ రాహుల్‌ను కౌగిలించుకున్న అభిమాని.. ఓదార్చిన క్రికెటర్ (వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించి, అజేయంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది.
మంగళవారం (మార్చి 4) దుబాయ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.
నిలకడగా ఆడి, 34 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచి, విన్నింగ్ సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.
అయితే గెలుపు అనంతరం మైదానంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Details
అభిమానిని హత్తుకున్న రాహుల్
మ్యాచ్ ముగిసిన తర్వాత, కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ ఇచ్చే సమయంలో స్టాండ్స్ నుంచి ఒక అభిమాని మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు.
అతను ఆనందంతో చేతులను పైకెత్తి, నేరుగా రాహుల్ దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు.
ఈ సమయంలో అతను భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాహుల్‌ను గట్టిగా హత్తుకున్నాడు.
ఓదార్చిన కేఎల్ రాహుల్
ఆ అభిమాని హఠాత్తుగా తన వద్దకు వచ్చినా, కేఎల్ రాహుల్ ఏ మాత్రం కంగారు పడలేదు. అతడిని సానుకూలంగా స్వీకరించి, ఓదార్చాడు.
అతని వీపును తడుతూ సముదాయించాడు. తర్వాత స్టేడియం సిబ్బంది వచ్చి ఆ వ్యక్తిని మైదానం నుంచి బయటికి తీసుకువెళ్లారు.
Details
రాహుల్ చర్యపై నెటిజన్ల ప్రశంసలు
ఈ ఘటనతో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ అభిమాని పట్ల చూపించిన ఆత్మీయతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అతను తన శాంతమైన స్వభావంతో, అభిమానిపై చూపిన ప్రేమతో ఎంతోమందిని మెప్పించాడు.
Details
జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడతా - రాహుల్
కేఎల్ రాహుల్ జట్టులో స్థానం దక్కించుకున్నప్పటి నుండి అతని బ్యాటింగ్ ఆర్డర్ అనేక మార్లు మారింది.
జట్టు అవసరాలను బట్టి అతను టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకూ అన్నిచోట్ల బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
రాహుల్ ఏ స్థానంలో అయినా ఆడగల సామర్థ్యం కలిగిన బ్యాటర్. అందుకే మేనేజ్‌మెంట్ అతనిపై విశ్వాసం ఉంచింది.
అయితే కొన్ని సందర్భాల్లో అతను నెమ్మదిగా ఆడుతున్నాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. సెమీఫైనల్ విజయానంతరం ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, జట్టు అవసరాలకు అనుగుణంగా తాను బ్యాటింగ్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పాడు.
టాప్ ఆర్డర్‌లో ఆడడం ఇష్టమే అయినా, మిడిల్ ఆర్డర్‌లో ఆడడాన్ని కూడా ఆస్వాదిస్తున్నానని తెలిపాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
A Fan hugged KL Rahul after the Semi-Final and a beautiful gesture by Rahul as well ♥️ pic.twitter.com/qykn66XPdb
— Johns. (@CricCrazyJohns) March 5, 2025