Page Loader
వేలంలో రికార్డు సృష్టించిన విదేశీ ప్లేయర్లు
ఎల్లీస్ పెర్రీని రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

వేలంలో రికార్డు సృష్టించిన విదేశీ ప్లేయర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2023
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో మహిళా ప్లేయర్స్ పై ప్రాంఛైజీలు డబ్బులు వర్షం కురిపించాయి. ముఖ్యంగా భారత్ స్టార్ స్మృతి మంధాన రికార్డు స్థాయిలో రూ.3.40 కోట్లకు బెంగళూర్ కొనుగోలు చేసింది. అలాగే విదేశీ ప్లేయర్లు నటాలీ స్కివర్-బ్రంట్‌, ఆష్లీ గార్డనర్ అత్యంత ఖరీధైన ఆటగాళ్లగా నిలిచారు. బెత్‌మూనీ, ఎల్లీస్‌పెర్ర వేలంలో మంచి ధర పలికారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నటాలీ స్కివర్-బ్రంట్‌ను ముంబై ఇండియన్స్ రూ. 3.2 కోట్లకు తీసుకుంది. ఆమె ఇప్పటివరకు 104 టీ20లు ఆడి 1,999 పరుగులు చేసింది. ఇందులో ఎనిమిది అర్ధ సెంచరీలున్నాయి. అదే బౌలింగ్ విభాగంలో 78 వికెట్లను పడగొట్టింది. వెటరన్ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.1.7 కోట్లకు తీసుకుంది.

ఆష్లీ గార్డనర్‌

విదేశీ మహిళా ప్లేయర్స్‌కు అధిక ధర

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసింది. గార్డనర్‌ కోసం యుపి వారియర్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ వారియర్స్ పోటీ పడ్డాయి. గార్డనర్ 68 టీ20 మ్యాచ్‌ల్లో 1,069 పరుగులు చేసింది.. ఇందులో ఆరు అర్ధ సెంచరీలున్నాయి. రైట్ ఆర్మ్ స్పిన్నర్ ఆస్ట్రేలియా తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో ప్లేయర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ బెత్ మూనీని గుజరాత్ జెయింట్స్ రూ. 2.00 కోట్లకు తీసుకుంది. ఆమె 78టీ20ల్లో 2,144 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలను సాధించింది. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న సోఫీ ఎక్లెస్టోన్‌ను యూపీ వారియర్జ్‌ రూ. 1.80 కోట్లకు తీసుకుంది