ఆర్‌సీబీలోకి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా డబ్ల్యూపీఎల్ అరంగేట్ర సీజన్‌కు సంబంధించిన వేలం ప్రారంభమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు మార్చి 4 నుంచి 26 వరకు జరగనున్నాయి. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టేడియాలు వేదిక కానున్నాయి. మొదటి ఎడిషన్లో భారత స్టార్ ఆటగాళ్లు మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, ఆస్ట్రేలియా అల్ రౌండర్ ఎల్లిస్ పెర్రీల కోసం ఐదు ఫ్రాంచేజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి ఎల్లిస్ పెర్రీని రూ. 1.7 కోట్లకు బెంగళూర్ రాయల్స్ కొనుగోలు చేసింది. పెర్రీ అత్యుత్తమ అల్‌రౌండర్, ఎన్నో సందర్భాల్లో ఆస్ట్రేలియా గెలుపు కోసం కృషి చేసింది
స్మృతి మంధానతో కలిసి ఆడనున్న ఎల్లీస్ పెర్
ఇప్పటివరకూ ఎల్లీస్ పెర్రీ 134 టీ20 మ్యాచ్‌లో 1515 పరుగులు చేశారు. ఇందులో ఏడు అర్ధ సెంచరీలున్నాయి. బౌలింగ్ విభాగంలో 120 వికెట్లు పడగొట్టింది. దీంతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధానను ఆర్‌సీబీ రూ.3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో భారత ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి పెర్రీ ఆడనుంది. అయితే మంధాన బెంగుళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించాలని అభిమానులు కోరుతున్నారు. ముఖ్యంగా మంధాన టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్‌గా ఆమె నిలిచింది.