Virat Kohli Record: ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయం.. తొలి బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను చాటుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ అద్భుతంగా ఆడి 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఛేదనల్లో 4 వేలకుపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. తన స్థిరమైన ప్రదర్శనతో ఈ మైలురాయిని అందుకున్నాడు.
వివరాలు
అత్యధిక పరుగుల చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానం
ఇక మొత్తం టీ20 క్రికెట్‌లో కూడా కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతోంది. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్‌ను కోహ్లీ అధిగమించాడు. మాలిక్ 557 మ్యాచ్‌లలో 13,571 పరుగులు చేయగా, కోహ్లీ కేవలం 415 మ్యాచ్‌లలోనే 13,612 పరుగులు నమోదు చేసి అతన్ని దాటేశాడు.