WPL: డబ్ల్యూపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత.. 350కు పైగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితా ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ స్మృతి మంధాన ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో మంధాన మొత్తం 9 ఇన్నింగ్స్‌ల్లో 377 పరుగులు సాధించి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె స్ట్రైక్‌రేట్ 150కి పైగా ఉండటం విశేషం. డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్‌లో మంధాన అద్భుత ప్రదర్శన కనబరిచింది. కేవలం 41 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టును విజయంలో నిలిపింది. ఆమె ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఒక ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ సీజన్‌లో 350కి పైగా పరుగులు చేసిన బ్యాటర్ల వివరాలు ఇవీ..
Details
ఎలీస్ పెర్రీ - 2025 (372 పరుగులు)
ఈ జాబితాలో మరో ఆర్‌సీబీ స్టార్ ఎలీస్ పెర్రీ చోటు దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ పెర్రీ 2025 సీజన్‌లో అద్భుత ఫామ్‌లో కనిపించింది. అయితే ఆ సీజన్‌లో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. పెర్రీ 8 మ్యాచ్‌ల్లో 372 పరుగులు సాధించి 93 సగటుతో ఆకట్టుకుంది. ఆమె స్ట్రైక్‌రేట్ 148.8గా ఉండగా, ఈ ఇన్నింగ్స్‌ల్లో నాలుగు అర్ధ శతకాలు నమోదు చేసింది.
Details
స్మృతి మంధాన - 2026 (377 పరుగులు)
డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్‌లో మంధాన ఆడిన కీలక ఇన్నింగ్స్ ఆమెను ఈ జాబితాలో రెండో స్థానానికి చేర్చింది. ఈ సీజన్‌లో ఆమె 9 మ్యాచ్‌ల్లో 377 పరుగులు చేసి 53.85 సగటుతో రాణించింది. ఆర్‌సీబీ కెప్టెన్‌గా మంధాన దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఆమె స్ట్రైక్‌రేట్ 153.25గా నమోదు అయ్యింది. ఈ సీజన్‌లో మంధాన మూడు సార్లు 50 పరుగుల మైలురాయిని అధిగమించగా, అత్యధిక స్కోర్ 96గా ఉంది.
Details
నాట్ స్కివర్-బ్రంట్ - 2025 (523 పరుగులు)
ఈ జాబితాలో అగ్రస్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ నాట్ స్కివర్-బ్రంట్ నిలిచింది. ఇప్పటివరకు డబ్ల్యూపీఎల్‌లో ఏ బ్యాటర్ కూడా ఒక సీజన్‌లో 400 పరుగులు దాటని పరిస్థితుల్లో, స్కివర్-బ్రంట్ 2025 సీజన్‌లో ఏకంగా 523 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. ఆమె 9 మ్యాచ్‌ల్లో 65.37 సగటుతో పరుగులు రాబట్టింది. ముంబై ఇండియన్స్ రెండోసారి టైటిల్ గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ ఐదు అర్ధ శతకాలు బాదగా, ఆమె స్ట్రైక్‌రేట్ 152.47గా నమోదైంది.