ఐపీఎల్‌ల్లో ఆడకపోయినా పంత్‌కు అరుదైన గౌరవం
ఢిల్లీ క్యాపిటల్స్ టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఇస్తున్న గౌరవం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న రిషబ్ పంత్ ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా ఢిల్లీ టీమ్ హెడ్ కోచ్ రికి పాటింగ్, రిషబ్ పంత్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి అతడు ఆడకపోయినా కనీసం టీమ్ డగౌట్ లో తన పక్కన కూర్చోవాలని రికిపాటింగ్ ఆరాటపడ్డాడు. అయితే పంత్ ఇప్పుడున్న పోజిషన్ లో అది వీలు కాదు. అయితే పంత్ టీమ్ తోనే ఉన్న ఫీలింగ్ కలిగేలా అతని జెర్సిని ఆడిస్తామని, టీమ్‌లో 11మందిలో ఎవరో ఒకరు పంత్ జెర్సీని వేసుకొని ఆడతారన్నారు.
ప్లేయర్లు ధరించే క్యాప్‌లో పంత్ జెర్సీ నెంబర్
ప్లేయర్లు ధరించే క్యాప్ లో పంత్ జెర్సీ నెంబర్ ఉంటుందని, పంత్ తమతో లేకపోయినా తమ లీడర్ అని చాటి చెప్పడానికి ఇలా చేస్తున్నామని రికి పాంటింగ్ వెల్లడించారు. పంత్ ప్లేస్‌లో ఎవరిని వికెట్ కీపింగ్ చేయించాలో డిల్లీ క్యాపిటల్స్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. అయితే సర్ఫరాజ్ ఖాన్ తో కీపింగ్ చేయించే అవకాశం ఉండనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌కి డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.