Eng vs Aus: యాషెస్ తొలి టెస్టులో అరుదైన ఘటన.. 75ఏళ్ల తర్వాత మొదటిసారి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (2025-26)కు శుక్రవారం తెరలేచింది. పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ కీలక మ్యాచులో ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇద్దరూ గాయాల కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో జట్టును పర్యవేక్షించే బాధ్యత సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ పై పడింది. ఇదే మ్యాచ్‌లో జేక్ వెదరాల్డ్ (31), బ్రెండన్ డాగెట్ (31) లు ఆసీస్ తరఫున టెస్టు అరంగేట్రం చేశారు.
Details
1946 తరువాత ఇదే తొలి సందర్భం
30 ఏళ్లు దాటిన క్రికెటర్లు ఆస్ట్రేలియా జట్టులో టెస్టు డెబ్యూ చేయడం 1946 తరువాత ఇదే తొలి సందర్భం. అప్పట్లో వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌పై జరిగిన టెస్టులో ఇదే విధమైన అరంగేట్రాలు నమోదయ్యాయి. దేశవాళీ క్రికెట్‌లో వరుసగా మంచి ప్రదర్శనలతో మెప్పించిన వెదరాల్డ్, డాగెట్‌లకు ఈసారి చివరికి ఆసీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు గాయాల కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇంగ్లండ్ వేగవంతమైన పేసర్ మార్క్ వుడ్ ఈ మ్యాచ్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆసక్తికరంగా, ఈ టెస్టులో ఇంగ్లండ్ తమ తుది జట్టులో ఒక్క స్పిన్నర్ కూడా లేకుండా ఆడుతోంది.
Details
ఇరు జట్లలోనే ప్లేయర్లు వీరే
ఆస్ట్రేలియా జట్టు ఇదే ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ , మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్ ఇంగ్లండ్ జట్టు ఇదే బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ , గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్