
WPL 2025 Auction: 16 ఏళ్ల అమ్మాయికి రికార్డు ధర.. సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం బెంగళూరు వేదికగా నిర్వహిస్తున్న మినీ వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది.
భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్ ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్‌గా నిలిచింది. ఆమెను గుజరాత్ జెయింట్స్ రూ.1.90 కోట్లకు సొంతం చేసుకుంది.
సిమ్రాన్ బేస్ ధర కేవలం రూ.10 లక్షలు కాగా, దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య హోరాహోరీ బిడ్డింగ్ జరగడంతో ఆమె ధర భారీగా పెరిగింది.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్‌ను కూడా గుజరాత్ జెయింట్స్ రూ.1.70 కోట్లకు కొనుగోలు చేసింది.
ఆమె కనీస ధర రూ.50 లక్షలు కాగా, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య బిడ్డింగ్‌లో చివరికి గుజరాత్ విజయం సాధించింది.
Details
రూ.1.60 కోట్ల ధర పలికన కమలి
16 ఏళ్ల భారత వికెట్‌కీపర్ జి కమలిని రూ.1.60 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయింది.
ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య బిడ్డింగ్ తర్వాత, ముంబయి ఇండియన్స్ కమలినిని తమ జట్టులోకి తీసుకుంది.
అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో ఆమె ఎనిమిది మ్యాచ్‌ల్లో 311 పరుగులతో రెండో టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు, పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా కూడా అదరగొట్టింది.
వేలంలో పూనమ్ యాదవ్, ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలారు.
Details
ఇప్పటివరకు అమ్ముడైన ప్లేయర్ల జాబితా
1. సిమ్రాన్ షేక్ - రూ. 1.90 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
2. డియాండ్రా డాటిన్ - రూ. 1.70 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
3. జి కమలిని - రూ. 1.60 కోట్లు (ముంబయి ఇండియన్స్)
4. ప్రేమ రావత్ - రూ. 1.20 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
5. ఎన్. చరణి - రూ. 55 లక్షలు (దిల్లీ క్యాపిటల్స్)
6. నాడిన్ డి క్లర్క్ - రూ. 30 లక్షలు (ముంబయి ఇండియన్స్)
7. నందిని కశ్యప్ - రూ. 10 లక్షలు (దిల్లీ క్యాపిటల్స్)
ప్రత్యేకంగా యువ ఆటగాళ్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న ఫ్రాంఛైజీలు, కీలక ఆటగాళ్లను భారీ ధరలకు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.