Glenn Maxwell Retirement: అభిమానులకు షాక్.. అంతర్జాతీయ క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 38 ఏళ్ల మ్యాక్స్‌వెల్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన అతను.. మూడు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2015 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా జట్లలో కీలక భాగస్వామిగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓ శకం ముగిసినట్లయింది. వాస్తవానికి మ్యాక్స్‌వెల్ 2025 జూన్ 2నే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా టీ20 ఫార్మాట్ నుంచి కూడా తప్పుకోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసింది.
వివరాలు
ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌కు కూడా వీడ్కోలు
తన కెరీర్‌లో మొత్తం 149 వన్డేలు, 130 టీ20లు, 7 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.2026 ఫిబ్రవరిలో ఒమన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ అతనికి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది.
నవంబర్ 21 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో అతనికి చోటు దక్కలేదు. దీంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.
అంతకుముందే ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌కు కూడా మ్యాక్స్‌వెల్ వీడ్కోలు పలికాడు.
వివరాలు
జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయం!
తన రిటైర్మెంట్ నిర్ణయం వెనుక గల కారణాలను మ్యాక్స్‌వెల్ 'ఫైనల్ వర్డ్' అనే పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు, ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యంతో చాలాసార్లు చర్చలు జరిపినట్లు తెలిపాడు.
అయితే తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు, ఆ తర్వాత జట్టు యాజమాన్యంతో అనేకసార్లు మాట్లాడాను.
వారి నుంచి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని వారు భావిస్తున్నట్లు నాకు అర్థమైంది.
బంగ్లాదేశ్ సిరీస్‌లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించడం మనం చూశామని మ్యాక్స్‌వెల్ వివరించాడు.
వివరాలు
సొంత మైదానంలో వీడ్కోలు మ్యాచ్ ఆడాలనుకున్న మ్యాక్సీ!
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ముందు తన సొంత మైదానమైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో చివరి మ్యాచ్ ఆడాలనే కోరిక ఉండేదని మ్యాక్స్‌వెల్ వెల్లడించాడు.
అయితే ఆ అవకాశం దక్కకుండానే ఆటకు గుడ్‌బై చెప్పాల్సి రావడంపై తన ఆవేదనను పంచుకున్నాడు.
నా సొంత మైదానమైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని చిన్న ఆశ ఉండేది.
అయితే, జట్టు యాజమాన్యం ఆలోచనా విధానాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని రాబోయే 12 నుంచి 24 నెలల్లో జట్టులో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.
యువ ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్‌లోని ఒత్తిడికి అలవాటు చేయాల్సి ఉంటుంది.
వివరాలు
జట్టు కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం..
అలాంటి అనుభవం 'బిగ్ బాష్ లీగ్' (బీబీఎల్) మ్యాచ్‌ల ద్వారా ప్రతిసారీ లభించదు" అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధం కావాలా? లేక తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలా? అనే సందిగ్ధ పరిస్థితి ఎదురైనప్పుడు తన శరీరానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు మ్యాక్స్‌వెల్ తెలిపాడు.
మోకాలి సమస్యతో ఇబ్బంది పడుతున్న అతను.. బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధమవ్వాలని భావిస్తున్నాడు. మోకాలికి ఇంజెక్షన్ తీసుకుని బీబీఎల్ కోసం సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాను.
ఇప్పుడు నా శరీరాన్ని తిరిగి దృఢంగా మార్చుకోవడానికి ఎనిమిది వారాల పాటు పునరావాస ప్రక్రియలో ఉంటాను.
వివరాలు
మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామి
నా అభిమాన క్రికెట్ హీరోల మాదిరిగా ఘనంగా వీడ్కోలు లభిస్తుందని ఒక్కోసారి మనసు కోరుకుంటుంది.
కానీ వాస్తవాన్ని అంగీకరించి ముందుకు సాగాలని మ్యాక్స్‌వెల్ తన మనసులోని మాటను వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్.. మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామిగా నిలిచాడు.
ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికినప్పటికీ, బీబీఎల్ కోసం సిద్ధమవుతూ తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టనున్నాడు.