NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL2024:SRHలో అత్యధిక పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ కి కాకుండా..అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..ఎందుకో తెలుసా ?
    తదుపరి వార్తా కథనం
    IPL2024:SRHలో అత్యధిక పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ కి కాకుండా..అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..ఎందుకో తెలుసా ?
    అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..ఎందుకో తెలుసా ?

    IPL2024:SRHలో అత్యధిక పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ కి కాకుండా..అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..ఎందుకో తెలుసా ?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 28, 2024
    09:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసింది.

    హైదరాబాద్‌లోని తమ సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో SRH 31 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది.

    హైదరాబాద్ విజయంలో చాలా మంది హీరోలు ఉన్నారు, వారిలో దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ పెద్ద పాత్ర పోషించాడు.

    క్లాసెన్ 80 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులు చేసింది.

    ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరుగా కొత్త రికార్డుగా నిలిచింది. అయినప్పటికీ, అతని కంటే తక్కువ పరుగులు చేసిన SRH బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

    ఐపీఎల్ 

    ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన SRHటీం

    హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి హైదరాబాద్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసారు.

    గతంలో 2013 లో పుణె వారియర్స్‌ పై ఆర్సీబీ సాధించిన 263/5 పరుగుల రికార్డ్ ను SRH బ్రేక్ చేసింది.

    ముంబై కూడా ధీటుగా స్పందించి 246 పరుగులు చేసింది. ఇది ఐపిఎల్ చరిత్రలో రెండవ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు.

    ఇరు జట్లు మొత్తం 523 పరుగులు చేశాయి, ఇది టీ20 క్రికెట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు.

    హెన్రిచ్ క్లాసెన్

    రాణించిన హెన్రిచ్ క్లాసెన్

    రెండు జట్ల బ్యాట్స్‌మెన్ అద్భుతమైన పవర్-హిటింగ్‌తో వీలు చిక్కినప్పుడల్లా బంతిని చాలాసార్లు బౌండరీకి ​తరలించారు.

    హైదరాబాద్‌కు చెందిన అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ కేవలం 34 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేశాడు. ఇది రెండు జట్లలో అత్యధికం.అతని ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు,4 ఫోర్లు కొట్టాడు.

    ఇదిలావుండగా, జట్టు విజయం తర్వాత, అతని సహచరుడు అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావడం కొంతమందిని ఆశ్చర్యపరిచింది.

    అభిషేక్ శర్మ

    అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ 

    యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 63 పరుగులు చేశాడు.

    అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు,7 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అయినప్పటికీ, అతను కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీని సాధించడం వలన ఈ అవార్డును అందుకున్నాడు.

    ఇది IPL 2024 సీజన్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డు.

    ఇది మాత్రమే కాదు, అతని 63 పరుగులు క్లాసెన్ 80 పరుగుల కంటే వేగంగా వచ్చాయి.

    అభిషేక్ ఈ పరుగులను కేవలం 23 బంతుల్లో 273.91 స్ట్రైక్ రేట్‌తో సాధించగా, క్లాసన్ స్ట్రైక్ రేట్ 235.29.

    అంటే ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అతనే హీరో ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సన్ రైజర్స్ హైదరాబాద్
    ముంబయి ఇండియన్స్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    సన్ రైజర్స్ హైదరాబాద్

    ఐపీఎల్‌లో చెలరేగేందుకు సన్ రైజర్స్ ఆల్ రౌండర్లు రెడీ..! ఐపీఎల్
    ఐపీఎల్‌లో నన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన రికార్డులివే ఐపీఎల్
    ఈసారీ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తగ్గేదేలే..! ఐపీఎల్
    సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. రికార్డులు ఐపీఎల్

    ముంబయి ఇండియన్స్

    విజృంభించిన గుజరాత్ బౌలర్లు; ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి ఐపీఎల్
    యశస్వీ జైస్వాల్ సూపర్ సెంచరీ.. ముంబై ముందు భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్
    డేవిడ్ సిక్సర్ల మోత.. భారీ లక్ష్యాన్ని చేధించిన ముంబై ఇండియన్స్  రాజస్థాన్ రాయల్స్
    ఐపీఎల్‌లో యంగ్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడ్‌లో హవా  రాజస్థాన్ రాయల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025