Afghanistan Cricket Team: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో తన అత్యుత్తమ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకను వెనక్కి నెట్టి ఆఫ్ఘనిస్థాన్ ఆరో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 2009లో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ జట్టు.. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్లలో ఒకటిగా ఎదిగి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాలు
ప్రపంచకప్‌లలోనూ అదరగొట్టిన ఆఫ్ఘనిస్థాన్
గత కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన చేస్తోంది.
2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్, శ్రీలంక వంటి మాజీ ఛాంపియన్ జట్లను ఓడించి సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది.
ఇప్పటివరకు 191 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ఘనిస్థాన్ 96 విజయాలు సాధించింది. ఈ గణాంకాలు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు సాధించిన పురోగతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
వివరాలు
దిగ్గజ జట్లను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ వంటి జట్ల కంటే మెరుగైన స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్.. తాజాగా శ్రీలంకను కూడా అధిగమించింది.
దీంతో తన చరిత్రలోనే అత్యుత్తమమైన ఆరో ర్యాంక్‌ను అందుకుంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకోవడం ఆఫ్ఘనిస్థాన్‌కు కలిసొచ్చింది.
అంతేకాకుండా జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో జరిగిన ట్రై-సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా విజేతగా నిలిచింది.
ఈ విజయాలు వన్డే ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు మెరుగైన స్థానానికి చేరుకోవడంలో కీలకంగా మారాయి.
వివరాలు
జింబాబ్వేపై క్లీన్‌స్వీప్.. టెస్టు సిరీస్‌కు సిద్ధం
వన్డేల్లోనే కాకుండా టీ20 ఫార్మాట్‌లోనూ ఆఫ్ఘనిస్థాన్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి తన సత్తా చాటింది.
ఇప్పుడు అదే జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది.
క్రమశిక్షణ, అంకితభావంతో కూడిన ఆటతీరుతో అగ్రశ్రేణి జట్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఆఫ్ఘనిస్థాన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.
వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకోవడం ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోనుంది.