హాఫ్ సెంచరీతో రాణించిన ఐడెన్ మార్క్రమ్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ వాంఖెడే స్టేడియంలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచులో మొదట టాస్ నెగ్గిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో రీజా హెండ్రిక్(12), రస్సీ వాన్ డెర్ డసెన్(1) త్వరగా పెవిలియానికి చేరారు. ఈ క్రమంలో 36 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ క్వింటాన్ డికాక్ తో కలిసి, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ స్కోరును పరిగెత్తించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 131 పరుగులను జోడించారు. ఈ క్రమంలో ఐడెన్ మార్క్రమ్ 69 బంతుల్లో 60 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. తర్వాత షకీబుల్ హసన్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్ కు క్యాచ్ ఇచ్చి మార్ర్కమ్ ఔట్ అయ్యాడు.
తొమ్మిదో హాఫ్ సెంచరీని నమోదు చేసిన ఐడెన్ మార్క్రమ్
ఈ హాఫ్ సెంచరీతో ఐడెన్ మార్క్రమ్ వన్డే క్రికెట్‌లో తొమ్మిదో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అదే విధంగా 60 వన్డేల్లో మార్క్రామ్ 37.11 సగటుతో 1,930 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలను బాదాడు. ఇక వన్డే ప్రపంచ కప్ టోర్నీలలో 400 పరుగుల మార్క్‌ను అతను అందుకున్నాడు. ఇక బెంగళూరులో శ్రీలంక జరిగిన మ్యాచులో కేవలం 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే.