Loading...
Anirudh Ravichander: గ్రీస్‌లో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి? రజనీకాంత్, స్టాలిన్ ప్రయాణం!
గ్రీస్‌లో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి? రజనీకాంత్, స్టాలిన్ ప్రయాణం!

Anirudh Ravichander: గ్రీస్‌లో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి? రజనీకాంత్, స్టాలిన్ ప్రయాణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2026
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ వివాహ బంధంతో ఒకటవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి వివాహ వేడుక గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా నవంబర్ 10, 11 తేదీల్లో అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు హాజరయ్యేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ రోజు ఉదయం విమానాశ్రయం నుంచి గ్రీస్‌కు బయల్దేరి వెళ్లారు. దీంతో ఈ హైప్రొఫైల్ వివాహంపై ఆసక్తి నెలకొంది.

వివరాలు

ఎవరీ కావ్య మారన్?

కావ్య మారన్ ప్రఖ్యాత సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె.

ప్రస్తుతం ఆమె ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా, సన్ టీవీ నెట్‌వర్క్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరోవైపు అనిరుధ్ రవిచందర్ దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.

వీరిద్దరి వివాహంపై చాలాకాలంగా చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు పెళ్లి వేడుకలు మొదలయ్యాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

వివరాలు

గ్రీస్‌లో ప్రైవేట్ వేడుక.. చెన్నైలో భారీ రిసెప్షన్

గ్రీస్‌లో జరగనున్న ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు సమాచారం.

అనంతరం నవంబర్ 21న చెన్నైలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక

చెన్నైలో జరగనున్న రిసెప్షన్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికను కావ్య మారన్ తల్లిదండ్రులు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు.

దీంతో రిసెప్షన్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పలువురు అగ్రశ్రేణి ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.

అయితే వివాహ ఏర్పాట్లపై అనిరుధ్, కావ్య కుటుంబాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సోషల్ మీడియాలో మాత్రం వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు, ప్రముఖుల ప్రయాణ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ADVERTISEMENT