Virat Kohli :ఐపీఎల్‌లో మరో మైలురాయి.. కోహ్లీ నుంచి వచ్చే మరో అద్భుత రికార్డు ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ అంటేనే రికార్డుల సంబరం.. ఆ సంబరంలో ఎప్పుడూ కేంద్రబిందువుగా నిలిచేది విరాట్ కోహ్లీ. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తరఫున ఆడుతున్న ఈ స్టార్ బ్యాటర్, మరోసారి రికార్డుల వేటకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో 8,000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక ఆటగాడిగా నిలిచిన కోహ్లీ, 2026 సీజన్‌లో 9,000 పరుగుల క్లబ్‌లో చేరేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. మూడు సీజన్లుగా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న 'కింగ్ కోహ్లీ' ఈ సారి మరో చరిత్ర సృష్టించనున్నాడు.
Details
9000 పరుగులకు ఎంత దూరం?
ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 267 మ్యాచ్‌ల్లో 8,661 పరుగులు ఉన్నాయి. 2026 సీజన్‌లో కేవలం 339 పరుగులు చేస్తే, ఐపీఎల్‌లో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. గత సీజన్ల ప్రదర్శనను బట్టి చూస్తే ఇది అతనికి పెద్ద సవాలు కాదనే చెప్పాలి. 2023: 639 పరుగులు (సగటు 53.25) 2024: 741 పరుగులు (సగటు 61.75) 2025: 657 పరుగులు (సగటు 54.75)
Details
రికార్డుల రారాజు
2008 నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తూ కోహ్లీ ఎన్నో రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా 8 సెంచరీలు కొట్టిన రికార్డు కోహ్లీదే. రెండో స్థానంలో జోస్ బట్లర్ (7 సెంచరీలు) ఉన్నాడు. అలాగే ఈ లీగ్‌లో 63 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. పరుగుల పరంగా కోహ్లీకి దగ్గరలో ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో రోహిత్ శర్మ 7,000కు పైగా పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
Details
మార్చి 28న తొలి పోరు
అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీని అభిమానులు ప్రధానంగా ఐపీఎల్‌లోనే చూడనున్నారు. దీంతో 2026 సీజన్‌పై అంచనాలు మరింత పెరిగాయి. మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌తో కోహ్లీ తన రికార్డుల వేటను ప్రారంభించనున్నాడు.