Australia: ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ.. ప్రధాన పేసర్‌కి గాయం!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ గాయంతో మొత్తం టోర్నీ నుండి దూరమయ్యాడు. తాజాగా మరో కీలక బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా గాయపడినట్లు తెలిసింది. హాజిల్‌వుడ్ ప్రస్తుతం కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగా అతను ముఖ్య యాషెస్ సిరీస్‌లో కూడా పాల్గొలేకపోయాడు. పూర్తిగా కోలుకోవడానికి అతనికి ఇంకా రెండు వారాల సమయం పడనుంది. ఈ పరిణామంతో, ప్రపంచకప్ మ్యాచ్‌లలో హాజిల్‌వుడ్ జట్టులో ఉండకపోవచ్చని ఆసీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత మాత్రమే అతను జట్టుతో కలిసే అవకాశముంది.
Details
పూర్తి ఫిట్ గా టిమ్ డేవిడ్
హాజిల్‌వుడ్ దూరమైతే ఆస్ట్రేలియాకు అది బిగ్ షాక్ కానుంది. ప్రధాన పేసర్లు లేకుండా కంగారూలు బరిలోకి దిగాల్సి వస్తుంది. ఫిట్ కాకపోవడంతో, సెలెక్టర్లు షాన్ అబాట్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టులో చేర్చారు. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో గాయపడ్డ విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. అతను కొలంబోలో జట్టుతో కలిసే అవకాశం కలిగి ఉన్నాడు. అయితే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ అయ్యింది. ఫిబ్రవరి 11న ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడనుంది.