Josh Hazlewood: ఆసీస్‌కు మరో షాక్.. పేసర్ హేజిల్‌వుడ్ టోర్నీకి ఔట్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 06, 2026
12:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
శనివారం నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, ఆస్ట్రేలియా జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఆసీస్ జట్టుకు కీలక పేసర్ 'జోష్ హేజిల్‌వుడ్' టోర్నీకి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో హేజిల్‌వుడ్‌ను టీ20 ప్రపంచకప్‌కు దూరం పెట్టినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇంకా ప్రకటించలేదని సమాచారం. ఇప్పటికే కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టులో లేని నేపథ్యంలో హేజిల్‌వుడ్ కూడా దూరం కావడం ఆసీస్ బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బగా మారింది. కీలక టోర్నీ ఆరంభానికి ముందే రెండు ప్రధాన పేసర్లు దూరమవడంతో ఆస్ట్రేలియా జట్టు కాంబినేషన్‌పై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.