Loading...
Gautam Gambhir: ఆగస్టు 15న అన్ని ప్రశ్నలకు సమాధానం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ ధీమా!
ఆగస్టు 15న అన్ని ప్రశ్నలకు సమాధానం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ ధీమా!

Gautam Gambhir: ఆగస్టు 15న అన్ని ప్రశ్నలకు సమాధానం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ ధీమా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు తనపై వస్తున్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఇటీవల టెస్టు క్రికెట్‌లో టీమ్ ఇండియా ఎదుర్కొన్న వైఫల్యాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'మా ముందున్న సవాలు ఏమిటో మాకు పూర్తిగా తెలుసు. ఎందుకోసం ఆడుతున్నామో కూడా తెలుసు. మాలో ఇంకా ఎంతో సామర్థ్యం ఉంది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆగస్టు 15న శ్రీలంకతో గాలెలో జరిగే తొలి టెస్టులో మేము ముందుగా బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా.. మా ఆటతోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు.

వివరాలు

కొత్త ఆటగాళ్లపై గంభీర్ విశ్వాసం

ఈ సిరీస్‌కు ఎంపికైన కొత్త ఆటగాళ్లు దేశం గర్వించే ప్రదర్శన చేస్తారని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సారాంశ్ జైన్, ఆకిబ్ నబిలకు నా అభినందనలు. ఈ స్థాయికి చేరుకోవడానికి వారు ఎంతో కష్టపడి ఉంటారు.

అవకాశం వచ్చిన ప్రతిసారీ దేశం గర్వించేలా ఆడాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

బుమ్రా స్థానంలో ఆకిబ్ నబి

రెగ్యులర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడటంతో జమ్మూకశ్మీర్‌కు చెందిన యువ పేసర్ ఆకిబ్ నబికి తొలిసారి భారత టెస్టు జట్టులో అవకాశం లభించింది.

గత రంజీ ట్రోఫీ సీజన్‌లో జమ్మూకశ్మీర్ జట్టును విజేతగా నిలపడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

మరోవైపు మధ్యప్రదేశ్‌కు చెందిన స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ కూడా భారత్-ఏ జట్టుకు ఆడుతూ అద్భుత ప్రదర్శన చేసి సెలక్టర్లను ఆకట్టుకోవడంతో జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు.

ADVERTISEMENT

వివరాలు

సిరీస్ షెడ్యూల్

భారత్-శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆగస్టు 15న గాలెలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది.

గత సిరీస్ జ్ఞాపకం

గతేడాది డిసెంబర్‌లో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసింది.

ఆ నిరాశను మరచిపోయి శ్రీలంక సిరీస్‌లో బలంగా పుంజుకోవాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT