LOADING...
T20 World Cup: తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా విజృంభణ.. ఐర్లాండ్‌పై 67 పరుగుల ఘన విజయం
తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా విజృంభణ.. ఐర్లాండ్‌పై 67 పరుగుల ఘన విజయం

T20 World Cup: తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా విజృంభణ.. ఐర్లాండ్‌పై 67 పరుగుల ఘన విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమైన నాలుగు రోజులకు బరిలో దిగిన ఆస్ట్రేలియా, తన తొలి మ్యాచ్‌లోనే పూర్తి ఆధిపత్యం చూపించింది. బుధవారం జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. మార్కస్‌ స్టాయినిస్‌ 29 బంతుల్లో 45 పరుగులతో జట్టును ముందుకు నడిపించాడు. జోష్‌ ఇంగ్లిస్‌ 17 బంతుల్లో 37, కామెరూన్‌ గ్రీన్‌ 11 బంతుల్లో 21 పరుగులతో వేగంగా స్కోరు పెంచారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అడైర్‌ రెండు వికెట్లు తీసి కొంత ప్రతిఘటన చూపించాడు. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ 16.5 ఓవర్లకే 115 పరుగులకు కుప్పకూలింది.

వివరాలు 

ఛేదనలో ఐర్లాండ్‌ చతికిల

డాక్రెల్‌ 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నాథన్‌ ఎలిస్‌ 4 పరుగులకే 12, ఆడమ్‌ జంపా 23 పరుగులకే 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పారు. ఎలిస్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టిన ట్రావిస్‌ హెడ్‌ ఓపెనర్‌గా వచ్చి 6 పరుగులకే వెనుదిరిగాడు. అయినా ఇంగ్లిస్‌,గ్రీన్‌ దూకుడుతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా 64/2తో నిలిచింది. టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన మ్యాట్‌ రెన్‌షా 37 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. 88/4 వద్ద ఇబ్బందుల్లో ఉన్న కంగారూ జట్టును స్టాయినిస్‌, రెన్‌షా జోడీ 61 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించింది.

వివరాలు 

ఛేదనలో ఐర్లాండ్‌ చతికిల

చివర్లో కనోలీ, బార్ట్‌లెట్‌ చెరో 11 పరుగులు నాటౌట్‌గా చేసి స్కోరును మరింత పెంచారు. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్‌కు సరైన ఆరంభం దక్కలేదు. కెప్టెన్‌ స్టిర్లింగ్‌ కేవలం ఒక పరుగుకే రిటైర్డ్‌ హర్ట్‌గా బయటకు వెళ్లగా, పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 40/4తో తీవ్ర ఒత్తిడిలో పడింది. మ్యాచ్‌ మొత్తం ఎప్పుడూ ఐర్లాండ్‌ విజయం దిశగా సాగలేదు. డాక్రెల్‌ చేసిన పోరాటం వల్ల మాత్రమే ఓటమి కొంత గౌరవప్రదంగా మారింది. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 182/6 (స్టాయినిస్‌ 45, ఇంగ్లిస్‌ 37, రెన్‌షా 37, గ్రీన్‌ 21; మార్క్‌ అడైర్‌ 2/44); ఐర్లాండ్‌: 16.5 ఓవర్లలో 115 (డాక్రెల్‌ 41, టకర్‌ 24; ఎలిస్‌ 4/12, జంపా 4/23)

Advertisement