Page Loader
బడ్జెట్ ఎక్కువ అవుతోంది.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం
బడ్జెట్ ఎక్కువ అవుతోంది.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం

బడ్జెట్ ఎక్కువ అవుతోంది.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2023
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్‌ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ వేదిక కానుంది. అయితే తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తెలిపింది. ఈసారీ బడ్జెట్ ఎక్కువ అవుతోందని, అంత బడ్జెట్‌ను ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టలేమని, కాబట్టి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం తమకు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. గేమ్స్ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారమిచ్చామని, తమ కాంట్రాక్టు రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వాలని విక్టోరియా స్టేట్ ప్రతినిధులు తెలిపారు. క్రీడల ఏర్పాట్ల కోసం చేసిన అంచనా వ్యయం మూడింతలు పెరిగిందని విక్టోరియా ప్రీమియర్ డానియల్ ఆండ్రూస్ తెలిపారు.

Details

కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ఎక్కువ బడ్జెట్ ను కేటాయించలేం

మొదట కామన్ వెల్త్ గేమ్స్ కు బడ్జెట్ లో రెండు ఆస్ట్రేలియా బిలియన్ డాలర్స్ కేటాయించామని, కానీ ఇప్పుడు ఏడు ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్లు అయ్యేలా ఉందని మెల్ బోర్న్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విక్టోరియా స్టేట్‌ ప్రీమియర్‌ డానియల్ ఆండ్రూస్ పేర్కొన్నారు. ఒక ఆస్పత్రి లేదా స్కూల్ నిర్వహణకు ఖర్చు చేయాల్సిన దానిని ఇలా కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణకు వినియోగించలేమని చెప్పారు. విక్టోరియా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం తమను నిరుత్సాహపరిచిందని సీజీఎఫ్ పేర్కొంది. ఇక 2022లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌ పట్టణం ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే.