
IND Vs AUS : టీ20 సిరీస్‌లో బోణి కొట్టిన ఆస్ట్రేలియా.. మాక్స్ వెల్ ఊచకోత
ఈ వార్తాకథనం ఏంటి
గౌహతి వేదికగా జరుగుతున్న భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (123) సెంచరీతో రాణించడంతో భారత్ జట్టు 222 రన్స్ చేసింది.
సూర్యకుమార్ యాదవ్ 39, తిలక్ వర్మ 31 పరుగులతో ఫర్వాలేదనిపించారు.
ఇక యశస్వీ జైస్వాల్(6), ఇషాన్ కిషాన్ (0) నిరాశపరిచారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్ సన్, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆరోన్ హార్డీ తలా ఓ వికెట్ తీశారు.
Details
సెంచరీతో చెలరేగిన మాక్స్ వెల్
లక్ష్య చేధనకు ఆస్ట్రేలియాకు ఓపెనర్ ట్రావిస్ హెడ్ (35) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.
మరో ఓపెనర్ ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (10) తక్కువ పరుగులకే వెనుతిరిగారు.
తర్వాత వచ్చిన మాక్స్ వెల్ (104*) అజేయ శతకంతో ఆసీస్ జట్టుకు విజయాన్ని అందించారు.
చివర్లో మాథ్యూవైడ్ (28*) పరుగులతో రాణించాడు.
ఆస్ట్రేలియా చివరి బంతికి విజయం సాధించింది.
భారత్ బౌలర్లలో రవి బిషోని రెండు, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలా ఓ వికెట్ తీశారు.