IND vs SA Playing 11: అక్షర్ ఇన్.. సుందర్ ఔట్? టీం ఇండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు!
ఈ వార్తాకథనం ఏంటి
2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సూపర్ 8 కీలక పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 22) సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే రెండు జట్లు 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ తలపడ్డాయి. ఆ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. ప్లేయింగ్ 11పై చర్చ భారత జట్టు కూర్పు విషయానికొస్తే, అభిషేక్ శర్మ స్థానంలో సంజు సామ్సన్‌కు అవకాశం ఇవ్వవచ్చని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ కోచ్ శితాంషు కోటక్ మాట్లాడుతూ, అభిషేక్ బ్యాటింగ్‌ను అతిగా విశ్లేషించడం సరికాదని వ్యాఖ్యానించారు.
Details
వరుసగా మూడోసారి డకౌట్
చివరి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో అతనికి ఇది వరుసగా మూడో డకౌట్ కావడం గమనార్హం.
కోటక్ సూచించినట్టుగా అతడిని జట్టుకు దూరం చేయడం కష్టమేనని భావిస్తున్నారు.పెద్ద టోర్నమెంట్లలో గాయం వంటి అత్యవసర పరిస్థితులు తప్ప జట్టులో పెద్ద మార్పులు చేయని ధోరణి భారత్‌కు ఉంది.
జట్టు యాజమాన్యం అభిషేక్‌పై నమ్మకం ఉంచినందున దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కూడా అతడే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒక మార్పు ఉండవచ్చని సమాచారం.
సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. మిగతా జట్టులో మార్పులు ఉండకపోవచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
అంటే అహ్మదాబాద్‌లో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
Details
భారత్ vs దక్షిణాఫ్రికా టీ20 హెడ్ టు హెడ్
మొత్తం మ్యాచ్‌లు: 35
భారత్ విజయం: 21
దక్షిణాఫ్రికా విజయం: 13
టై: 0
ఫలితం లేదు: 1
ప్రపంచకప్‌లో హెడ్ టు హెడ్
మొత్తం మ్యాచ్‌లు: 7
భారత్ గెలిచింది: 5
దక్షిణాఫ్రికా గెలిచింది: 2
టై: 0
ఫలితం లేదు: 0
Details
సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో భారత్ జట్టు
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, రింకు సింగ్, అక్షర్ పటేల్
సూపర్ 8లో భారత్‌తో పోటీకి దక్షిణాఫ్రికా జట్టు
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రూవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్/జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి ఎన్గిడి
సూపర్ 8 దశలో కీలకమైన ఈ పోరు ఇరు జట్లకు సెమీఫైనల్ అవకాశాల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.