Page Loader
Babar Azam: బాబర్ ఆజమ్ వాట్సప్ మెసేజ్‌లు లీక్.. స్పందించిన పాక్ మాజీ కెప్టెన్
బాబర్ ఆజమ్ వాట్సప్ మెసేజ్‌లు లీక్.. స్పందించిన పాక్ మాజీ కెప్టెన్

Babar Azam: బాబర్ ఆజమ్ వాట్సప్ మెసేజ్‌లు లీక్.. స్పందించిన పాక్ మాజీ కెప్టెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2023
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగింది. ఈ టోర్నీలో రెండు వరుస విజయాలను అందుకున్న పాక్, అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచులో ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా మరో మ్యాచుల్లో ఓడిన పాకిస్థాన్ సెమీ ఫైనల్ ఛాన్సులను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6లో ఉన్న పాకిస్థాన్ టాప్ 4లోకి రావాలంటే, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జాకా ఆష్రఫ్‌కి, బాబార్ అజామ్‌కి మధ్య విభేదాలు తలెత్తడంతో పాక్ జట్టు సరిగ్గా ప్రదర్శన ఇవ్వలేకపోతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Details

పాక్ క్రికెట్ కు బాబర్ ఓ విలువైన ఆస్తి

తాజాగా ఈ అంశంపై పాకిస్థాన్ న్యూస్ ఛానల్ ఏఆర్‌వై న్యూస్ స్పందించింది. బాబర్, నువ్వు ఛైర్మెన్‌కి ఫోన్ చేస్తున్నా, అతని కాల్ ఎత్తడం లేదని టీవీలో, సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం అవుతోంది, అది నిజమేనా అని మెసేజ్ పంపిన అతను అడగాడు. దానికి బాబర్ ఆజమ్ సలామ్ సల్మాన్ భాయ్.. తాను సర్‌కి కాల్ చేయలేదని సమాధానం ఇచ్చినట్టు వాట్సాప్ మెసేజ్‌లను ఏఆర్‌వై న్యూస్ ప్రసారం చేసింది దీనిపై పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ స్పందించాడు. ఇది చాలా దారుణమని, దయచేసి బాబార్ అజామ్‌ని ఒంటరిగా వదిలేయాలని, అతను పాకిస్తాన్ క్రికెట్‌కు ఓ విలువైన ఆస్తి అంటూ ట్విట్ చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 వకార్ యూనిస్ చేసిన ట్వీట్