Loading...
BWF World Championships: బ్యాడ్మింటన్‌ 'ఒలింపిక్స్‌'.. ఇక్కడ డబ్బులు కాదు.. పాయింట్లే కరెన్సీ!
బ్యాడ్మింటన్‌ 'ఒలింపిక్స్‌'.. ఇక్కడ డబ్బులు కాదు.. పాయింట్లే కరెన్సీ!

BWF World Championships: బ్యాడ్మింటన్‌ 'ఒలింపిక్స్‌'.. ఇక్కడ డబ్బులు కాదు.. పాయింట్లే కరెన్సీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2026
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ వేదికగా బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ (BWF World Championships) పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ స్థాయి హేమాహేమీ షట్లర్లు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో బరిలోకి దిగారు. అయితే ఈ టోర్నీలో విజేతగా నిలిచే ఆటగాడికి నయాపైసా కూడా ప్రైజ్‌మనీగా రాదంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి నగదు బహుమతి లేనప్పుడు ఈ టోర్నీలో పాల్గొనడం వల్ల ఆటగాళ్లకు కలిగే ప్రయోజనాలేంటి? అంటే చాలానే ఉన్నాయి. అంతర్జాతీయంగా బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (BWF) నిర్వహించే వివిధ టోర్నీల్లో ప్రైజ్‌మనీ ఉంటుంది. టోర్నీ స్థాయిని బట్టి బహుమతి మొత్తం మారుతూ ఉంటుంది. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌లో ప్రైజ్‌మనీ 3 మిలియన్‌ డాలర్ల వరకు ఉండగా.. సూపర్‌ 1000 టోర్నీకి 1.45 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది.

వివరాలు

ఐదు విభాగాల్లో అత్యంత కఠినమైన పోటీ

అయితే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మాత్రం ఎలాంటి నగదు బహుమతి ఉండదు.

అందుకు బదులుగా ఆటగాళ్లు జాతీయ గౌరవం, ప్రతిష్ఠాత్మక ట్రోఫీ, ప్రపంచ ర్యాంకింగ్‌ పాయింట్ల కోసం ఐదు విభాగాల్లో అత్యంత కఠినమైన పోటీల్లో పాల్గొంటారు.

ప్రైజ్‌మనీ లేకపోయినా.. ఈ టోర్నీ ద్వారా ఆటగాళ్లకు లభించే ప్రయోజనాలు మాత్రం ఎంతో విలువైనవి.

వివరాలు

పాయింట్లే.. ఇక్కడ అసలైన కరెన్సీ

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌, డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయి.

ఇక్కడ నగదు బహుమతి లేకపోయినా ప్రపంచ ర్యాంకింగ్‌ పాయింట్లు లభిస్తాయి. బ్యాడ్మింటన్‌లో ఈ పాయింట్లను అత్యంత విలువైన కరెన్సీగా భావిస్తారు.

రెండేళ్ల కిందట అప్‌డేట్‌ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన షట్లర్‌కు 14,500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభిస్తాయి.

ఉదాహరణకు ప్రస్తుతం పీవీ సింధు 58,051 పాయింట్లతో 11వ స్థానంలో ఉంది.

ఈ ఎడిషన్‌లో ఆమె బంగారు పతకం గెలిస్తే.. మొత్తం 72,551 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. సెమీఫైనల్‌ వరకు చేరుకున్నా ఆమె ర్యాంక్‌ మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

పతకం వస్తే.. అక్కడి నుంచి నజరానాలు

అంతేకాదు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆటగాళ్లు సాధించిన ర్యాంకింగ్‌ పాయింట్ల ఆధారంగానే సూపర్‌ 1000, సూపర్‌ 750 వంటి కీలక టోర్నీల్లో సీడింగ్‌ను నిర్ణయిస్తారు.

కాబట్టి ఇక్కడ సాధించే ప్రతి విజయం ఆటగాళ్ల భవిష్యత్‌ టోర్నీలపైనా ప్రభావం చూపుతుంది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నగదు బహుమతి లేకపోవడం ఒలింపిక్స్‌ తరహాలోనే ఉంటుంది. ఒలింపిక్స్‌లోనూ అథ్లెట్లకు నిర్వాహకుల నుంచి నేరుగా ప్రైజ్‌మనీ ఉండదు.

కేవలం పతకాలు అందజేస్తారు. అయినప్పటికీ ఆ పతకాలు తెచ్చే గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైనది.

ADVERTISEMENT

వివరాలు

అవార్డులు, జీవితకాల పెన్షన్లు

అదే విధంగా బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన ఆటగాళ్లకు ఆయా దేశాల బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్లు, జాతీయ ఒలింపిక్‌ కమిటీలు, ప్రభుత్వాలు నజరానాలు ప్రకటిస్తాయి.

కొన్ని దేశాల్లో నగదు బహుమతులతో పాటు అవార్డులు, జీవితకాల పెన్షన్లు కూడా అందుతాయి.

అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచిన ఆటగాడికి 'ప్రపంచ ఛాంపియన్‌' అనే అరుదైన గౌరవం దక్కుతుంది.

అందుకే ప్రైజ్‌మనీ లేకపోయినా.. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఈ టోర్నీకి అంతటి ప్రాధాన్యం, క్రేజ్‌ ఉంటుంది.

ADVERTISEMENT