
RCB vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బెంగళూర్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.
ఈ మ్యాచులో ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (59*; 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఫిలిప్ సాల్ట్ (56; 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించడంతో ఆర్సీబీ సునాయాసంగా గెలుపొందింది.
చివర్లో లివింగ్ స్టోన్ ఐదు బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో 15 పరుగులు చేశాడు.
Details
మూడు వికెట్లతో చెలరేగిన కృనాల్ పాండ్యా
ఆర్సీబీ జట్టు 16.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానె (56; 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
సునీల్ నరైన్ (44; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంగ్‌క్రిష్ రఘువంశీ (30; 22 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్) రాణించారు. మిగతా బ్యాటర్లు మాత్రం విఫలమయ్యారు.
బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా (3/28) మూడు వికెట్లు తీసి మెరిశాడు