సంచలన రికార్డుకు చేరువలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ వన్డేలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఎన్నో మరుపురాని విజయాలందించిన షకిబుల్ తాజాగా మరో రికార్డుపై కన్నేశాడు. పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది, శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య మాత్రమే ఇంతవరకు ఈ ఫీట్ ను సాధించారు. వన్డేలో 7000 పరుగులు, 300 వికెట్లు తీసిన మూడో ఆల్ రౌండర్‌గా త్వరలో సంచలన రికార్డును సృష్టించనున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే మూడో, చివరి వన్డేలో షకీబ్ ఈ ఫీట్ సాధించే అవకాశం ఉంది. షకీబ్ ప్రపంచంలో గొప్ప ఆల్-రౌండర్‌లలో ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, వన్డేలో అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
వన్డే సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్
షకిబుల్ ఇప్పటివరకు 226 వన్డే మ్యాచ్‌లు ఆడి 296 వికెట్లు తీశాడు. ప్రస్తుతం వన్డేలో అత్యధిక వికెట్లు 14 బౌలర్‌గా నిలిచాడు. బ్యాటింగ్ విభాగంలో 6,901 పరుగులు చేశారు. ఇందులో 9 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు బాదాడు. 7వేల పరుగులు పూర్తి చేయడానికి 99 పరుగులు, 300 వికెట్లు తీయడానికి షకిబుల్ హసన్ కి నాలుగు వికెట్లు అవసరం. ఆఫ్రిది (8,064 పరుగులు, 395 వికెట్లు) జయసూర్య (13,430 పరుగులు, 323 వికెట్లు)తో ముందు స్థానంలో ఉన్నారు. ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఇప్పటికే బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ లను ఓడిపోయింది. దీంతో సిరీస్ 2-0తో బంగ్లాదేశ్ కోల్పోయింది.