BAN vs ENG: బంగ్లాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్
ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచింది. 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. దీంతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్‌ను 2-0తో తిరుగులేని అధిక్యాన్ని సాధించింది. సామ్ కర్రన్ 4 వికెట్లు, ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీసి బంగ్లా బ్యాటర్ల నడ్డి విరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రాయ్ 124 బంతుల్లో 132 పరుగులు, కెప్టెన్ బట్లర్ 76 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో మెయినల్ అలీ 42 పరుగులు, సామ్ కరన్ 33 పరుగులతో చెలరేగారు.
వన్డేలో 12 సెంచరీలు నమోదు చేసిన రాయ్
బంగ్లా బౌలర్లలో తస్కిన్ మూడు వికెట్ల, హసన్ రెండు, షకీబ్, తైజుల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లా 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్అల్ హసన్ 58 పరుగులు, తమీమ్ఇక్బాల్ 35 పరుగులతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రాయ్ వన్డేల్లో 12 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ గడ్డపై వన్డేలో శతకం బాదిన ఐదోవ ఇంగ్లండ్ ప్లేయర్‌గా రాయ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు మలన్ (114*), మోర్గాన్ (110*), కీస్‌వెటర్ (107), బెన్‌స్టోక్స్ (101) పరుగులు చేశాడు. బట్లర్ వన్డేల్లో 24వ అర్ధ సెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌పై ఐదుసార్లు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.