BAN vs ENG: జాసన్ రాయ్ సూపర్ సెంచరీ
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో అతి కష్టం మీద ఇంగ్లండ్ విజయం సాధించింది డేవిడ్ మలన్ సెంచరీ చేయడంతో మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గట్టెక్కింది. శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో తొలుత టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫిలిప్ 7 పరుగులకే వెనుతిరిగాడు. మొదటి మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటిన డేవిడ్ మలాన్ 11 పరగులకు, జేమ్స్ విన్స్ (5) ఔట్ అయ్యారు.
జాసన్ రాయ్, జోష్ బట్లర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులోకి నిల్చుకోని ఇంగ్లండ్ స్కోరును పరిగెత్తించారు.
ఇంగ్లండ్
బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్‌ను ఇచ్చిన ఇంగ్లండ్
జాసన్ రాయ్ 121 బంతుల్లో 134 పరుగులు చేసి బంగ్లాదేశ్‌పై చెలరేగిపోయాడు. అనంతరం షకిబుల్‌హసన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్య్లూగా వెనుతిరిగాడు. ప్రస్తుతం వన్డేలో 12 సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
జాసన్ రాయ్ కు తోడుగా కెప్టెన్ జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 64 బంతుల్లో 76 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు మంచి స్కోరును అందించాడు. చివర్లో మొయిన్ అలీ 35 బంతుల్లో 42 పరుగులు చేశాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ 50 ఓవర్ల నష్టానికి 326 పరుగులు చేసింది