Page Loader
సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన డేవిడ్ మలన్
వన్డేలో 4వ శతకాన్ని నమోదు చేసిన డేవిడ్ మలన్

సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన డేవిడ్ మలన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ విజయం సాధించింది. డేవిడ్ మలన్ అజేయ సెంచరీ తో ఇంగ్లండ్ జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డేలో డేవిడ్ మలన్ తన నాలుగో వన్డే సెంచరీని సాధించాడు. ఆరేళ్ల తర్వాత మొదటి సారి బంగ్లాదేశ్ స్వేదేశంలో తొలి వన్డే‌లో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా, టీమిండియా కూడా సిరీస్‌లు గెలవలేకపోయాయి. అయితే ఇంగ్లండ్‌ను బంగ్లాదేశ్ కూడా వణికించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 47.2 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు 14 వైడ్ బాల్స్, 4 నోబాల్స్ వేయడంతో బంగ్లాదేశ్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో 26 పరుగులు వచ్చాయి.

డేవిడ్ మలన్

సెంచరీతో ఇంగ్లండ్ జట్టును గెలిపించిన డేవిడ్ మలన్

మలన్ తొలి వన్డే శతకం గతేడాది జూన్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగులు చేశాడు. 16 మ్యాచ్‌లో 758 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలున్నాయి. 210 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌కి శుభారంభం దక్కలేదు. జాసన్ రాయ్ 4, ఫిలిఫ్ సాల్ట్ 12 పరుగులు, జేమ్స్ వీన్స్ 6, జోస్ బట్లర్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇంగ్లండ్ 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ మలన్ చివరి నిలిచి ఇంగ్లండ్ కు విజయాన్ని అందించారు.