BAN vs ENG: రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన జోస్ బట్లర్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ విజయఢంకా మోగించింది. డేవిడ్ మలన్ సెంచరీ చేయడంతో మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో తొలుత టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ శుభారంభం దక్కలేదు. ఓపెనర్ 7 పరుగులు, డేవిడ్ మలన్ (11), జేమ్స్ విన్ (5) పరుగులతో నిరాశపరిచారు. అనంతరం క్రీజులో ఉన్న జాసన్ రాయ్, జోస్ బట్లర్ బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చక్కటి షాట్లతో ఇంగ్లండ్ స్కోరును పరిగెత్తించారు.
ఈ క్రమంలో జాసన్ రాయ్ 134 పరుగులు చేసి షకిబుల్ హసన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్య్లూగా వెనుతిరిగాడు. కెప్టెన్ బట్లర్ 64 బంతుల్లో 76 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు.
బట్లర్
వన్డేలో 24 అర్ధ సెంచరీలు చేసిన బట్లర్
చివర్లో మొయిన్ అలీ (42), సామ్ కుర్రాన్ (33*) చెలరేగడంతో ఇంగ్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
బట్లర్ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో 24వ అర్ధ సెంచరీలను పూర్తి చేశాడు. ఈ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌పై ఐదు సార్లు హాఫ్ సెంచరీ చేశాడు. రెండో వన్డేలో బట్లర్ 4,600 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. 164 వన్డేల్లో 41.63 సగటుతో 4,621 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు బాదాడు.
326 పరుగల లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ 9 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (33), షకీబుల్ హసన్ 28 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.