NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BCCI: భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసిన బీసీసీఐ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    BCCI: భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసిన బీసీసీఐ
    భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసిన బీసీసీఐ

    BCCI: భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసిన బీసీసీఐ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 24, 2025
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 2024-25 సీజన్‌ కోసం భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది.

    ఈసారి మొత్తం 16 మంది మహిళా క్రికెటర్లకు BCCI కాంట్రాక్ట్ అందజేసింది.

    క్రికెటర్లను మూడు గ్రేడ్లుగా విభజించారు. ఇందులో గ్రేడ్ A లో ముగ్గురు, గ్రేడ్ B లో నలుగురు, గ్రేడ్ C లో తొమ్మిది మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.

    ఈ కాంట్రాక్ట్ 2024 అక్టోబర్ 1 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది.

    వివరాలు 

    గ్రేడ్ వారీగా మహిళా క్రికెటర్లు.. వార్షిక పారితోషికం 

    గ్రేడ్ A (₹50 లక్షలు) : హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ

    గ్రేడ్ B (₹30 లక్షలు) : రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షెఫాలీ వర్మ

    గ్రేడ్ C (₹10 లక్షలు) : యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, తితాస్ సాధు, అరుందతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా చేత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రకర్

    వివరాలు 

    పురుష,మహిళా కాంట్రాక్ట్‌ల మధ్య తేడా 

    బీసీసీఐ మహిళా,పురుష క్రికెటర్లకు సమానమైన మ్యాచ్ ఫీజును అందిస్తున్నప్పటికీ,వార్షిక కాంట్రాక్ట్‌లో మాత్రం భారీ తేడా ఉంది.

    పురుషుల కాంట్రాక్ట్‌లో A+ గ్రేడ్ ఉంది,దీంట్లో ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి ₹7 కోట్లు చెల్లిస్తారు.

    పురుషుల A గ్రేడ్ లో ₹5 కోట్లు,B గ్రేడ్ లో ₹3 కోట్లు,C గ్రేడ్ లో ₹1 కోటి అందజేస్తారు.

    ఈ భారీ వ్యత్యాసంపై మహిళా క్రికెట్ అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

    పురుషులకంటే మహిళా క్రికెటర్లకు తక్కువ మొత్తాన్ని కాంట్రాక్ట్ కింద చెల్లించడం న్యాయమా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

    అయితే,గత కొన్నేళ్లుగా మహిళా క్రికెట్‌కు బీసీసీఐ మరింత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నప్పటికీ, ఇంకా పురుషుల స్థాయిలో సమానమైన పారితోషికాన్ని అందించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీసీసీఐ విమెన్ చేసిన ట్వీట్ 

    🚨 News 🚨

    BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Women)#TeamIndia pic.twitter.com/fwDpLlm1mT

    — BCCI Women (@BCCIWomen) March 24, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    బీసీసీఐ

    BCCI: ఫీల్డింగ్‌లో 'పెనాల్టీ' పరుగులకు చెక్.. బీసీసీఐ నూతన మార్గదర్శకాలు క్రికెట్
    IND vs NZ 3rd Test: ముంబై టెస్టు పిచ్ రిపోర్ట్.. ఎవరికి అనుకూలంగా ఉందంటే? న్యూజిలాండ్
    Gautam Gambhir: గౌతమ్ గంభీర్ 'పవర్స్'కు బీసీసీఐ కత్తెర..? అనుకున్నంత ఫలితాలు రాకపోవడంతో ఇబ్బందులు.. గౌతమ్ గంభీర్
    SA vs IND: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆ ఇద్దరి ఎంట్రీ ఖాయమే! అసలు విషయం చెప్పేసిన సూర్య  సూర్యకుమార్ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025