పంత్ జెర్సీని వేలాడదీస్తారా.. మీకసలు బుద్ధుందా..?
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ చర్యలపై బీసీసీఐ అగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన విషయం తెలిసిందే. పంత్ గుర్తుగా అతడి జెర్సీని డగౌట్‌లో వేలాడదీయడంపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యాన్ని బీసీసీఐ మందలించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని ఢిల్లీ యాజమాన్యానికి బీసీసీఐ సూచించినట్లు తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ ఎంపికయ్యాడురు. అయితే పంచ్ మ్యాచ్ లు చూసేందుకు డగౌట్‌కి తీసుకొస్తామని ఆ జట్టు యాజమాన్యం తెలిపిన విషయం తెలిసిందే.
ఢిల్లీ యాజమాన్యాన్ని మందలించిన బీసీసీఐ
ఈ సమయంలో లక్నోతో ఆడిన తొలి మ్యాచ్‌లో పంత్ జెర్సీ నెంబర్.17ను డగౌట్ ను ప్రదర్శించారు.ఈ విషయంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇది చాలా తీవ్రమైన చర్య అని, ఇలాంటివి అంతిమ విషాదం లేదా రిటైర్మెంట్ సందర్భంలోనే చేస్తారని, అయితే ఇక్కడ పంత్ బాగున్నాడని, మంచి ఉద్ధేశంతోనే ఇలా చేసినా.. భవిష్యతులో వాటిని పునరావృతం చేయకూడదని బీసీసీఐ సూచించింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం (ఏప్రిల్ 4) గుజరాత్ టైటాన్స్‌తో సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు రిషబ్ పంత్ స్వయంగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.