
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ Vs గుజరాత్ టైటాన్స్.. పైచేయి ఎవరిదో!
ఈ వార్తాకథనం ఏంటి
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. లీగ్ తొలి మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన గుజరాత్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. రాత్రి 7 గంటలకు స్టార్‌స్పోర్ట్స్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది.
గత మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ చేతిలో 50 పరుగుల తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. ఎలాగైనా ఢిల్లీ జట్టుకు తొలి విజయాన్ని అందించాలని వార్నర్ సేన పట్టుదలతో ఉంది.
తొలి మ్యాచ్ విజయం తర్వాత గుజరాత్ టైటాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.
ఢిల్లీ
ఐపీఎల్‌లో ఢిల్లీ బోణి కొట్టేనా
గత మ్యాచ్‌లో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్లు పేలవ ప్రదర్శన చేశారు. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా ఢిల్లీకి పెద్ద సమస్యగా మారింది. గత సీజన్లో ఇరు జట్లు ఒకే మ్యాచ్‌లో తలపడగా గుజరాత్ 14 పరుగుల తేడాతో ఓడిపోయింది.
గుజరాత్ తరుపున శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ నాణ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారు.
ఢిల్లీ తరుపున వార్నర్, పృథ్వీషా, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, పావెల్ వంటి బ్యాటర్లు ఉన్నా.. అనుకున్న సమయంలో పరుగులు రాబట్టడంలో విఫమవుతున్నారు.
అయితే గుజరాత్ విజయపరంపరను కొనసాగిస్తుందా లేక ఢిల్లీ విజయంతో ఖాతా తెరుస్తుందా అన్నది వేచిచూడాల్సిందే.