IPL 2023: రిషబ్ పంత్ ప్లేస్‌లో రానున్న అభిషేక్ పోరెల్! ఇంతకీ అభిషేక్ పోరెల్ ఎవరు?
రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాటింగ్, రిషబ్ స్థానంలో కొంతమంది భారత వికెట్ కీపర్లను పరిశీలించినట్లు సమాచారం. అందులో అభిషేక్ పోరెల్ ప్రతిభ చాటుకోవడంతో అతన్ని సెలెక్ట్ చేసినట్లు తెలస్తోంది. 20 ఏళ్ల అభిషేక్ పోరెల్ బెంగల్ కి చెందినవాడు. దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరుపున ఆడుతున్నాడు. ఇప్పటివరకూ మూడు టీ20 మ్యాచ్ లు అడిన అతను కేవలం 22 పరుగులు చేశాడు. అయితే ప్రాక్టీస్ సమయంలో పోరెల్ అకట్టుకున్నట్లు తెలిసింది.
పోరెల్ బ్యాటింగ్‌లో రాణించే సత్తా ఉంది
అభిషేక్ ఇప్పటివరకు 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో మొత్తం 695 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నారు. బౌండరీలను కొట్టడంలో పోరెల్‌కు మంచి సామర్థ్యం ఉంది. కోచ్ బిభాస్ దాస్ వద్ద పోరెల్ శిక్షణ పొందాడు. కోచ్ బిభాస్ దాస్ మాట్లాడుతూ పోరెల్ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేసే నైపుణ్యం ఉందని, అతనిని ఎక్కువ మ్యాచ్ లు ఆడిస్తే తానెంటో నిరూపించుకుంటాడని స్పష్టం చేశారు. పోరెల్ కు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పటి నుండి దాస్ అతనికి శిక్షణ ఇస్తున్నారు అది ఇప్పటికీ కీపర్-బ్యాటర్ కెరీర్‌లో అతని ప్రభావం చూపుతూనే ఉంది.