Page Loader
IPL 2023: అభిమానులకు గుడ్‌న్యూస్.. నేడు స్టేడియంలోకి రిషబ్ పంత్
నేడు స్టేడియానికి రాబోతున్న రిషబ్ పంత్!

IPL 2023: అభిమానులకు గుడ్‌న్యూస్.. నేడు స్టేడియంలోకి రిషబ్ పంత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2023
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు సూపర్ గుడ్‌న్యూస్ అందింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ ఎట్టేకలకు క్రికెట్ స్టేడియంలోనికి అడుగుపెట్టబోతున్నాడు. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. నేడు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ను చూడటానికి రిషబ్ పంత్ వస్తున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రాజన్ చెప్పారు. రిషబ్ పంత్ మ్యాచ్ ఆడలేకపోయినప్పటికీ తన జట్టును ఎంకరేజ్ చేసేందుకు స్టేడియానికి రావాలని పంత్ నిర్ణయించుకున్నాడని ఆయన తెలియజేశారు.

రిషబ్ పంత్

రిషబ్ పంత్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు

పంత్ కోసం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని డీడీసీఏ డైరక్టర్ శ్యామ్ వర్మ చెప్పారు. పంత్‌ను ఇంటి నుంచి స్టేడియానికి తీసుకొచ్చి, తిరిగి ఇంట్లో డ్రాప్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. స్టేడియంలో డగౌట్ వరకు పంత్ కోసం ప్రత్యేకమైన ర్యాంప్‌ను ఉంచుతామన్నారు. గతంలో రిషబ్ పంత్ మైదానంలోకి దిగి ఆడకపోయినా స్టేడియానికి వచ్చి తమతో పాటు డగౌట్‌లో కూర్చుంటే బాగుంటుందని రికీ పాటింగ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే పంత్ ఫ్రాంఛైజీ ఓనర్స్ ఉండే ప్రాంతం నుంచి మ్యాచ్‌ను వీక్షించడానికి అవకాశం ఉండనుంది. ఒకవేళ బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రత బృందం అనుమతిస్తే కొంత సమయం అతడు డగౌట్‌లో ఉంటాడని ఆ ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీ ఎంకరేజ్ చేయడానికి పంత్ స్టేడియానికి వస్తున్నాడు