BCCI Partner with ChatGPT: చాట్‌జీపీటీ, క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్‌తో బీసీసీఐ ఒప్పందం.. రూ.130 కోట్లకు పైగా డీల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక భాగస్వామ్యాలను ప్రకటించింది. టీమిండియా స్వదేశీ క్రికెట్ సీజన్‌కు క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్, చాట్‌జీపీటీ సంస్థలను అసోసియేట్ పార్ట్‌నర్లుగా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మూడు సంస్థలతో కుదిరిన భాగస్వామ్యాలు రెండు సీజన్ల పాటు కొనసాగనున్నాయి. భారత్-వెస్టిండీస్ సిరీస్‌తో ఈ ఒప్పందాలు ప్రారంభమై.. 2028 మార్చి వరకు అమల్లో ఉంటాయి. ఈ మూడు భాగస్వామ్యాల ద్వారా బీసీసీఐకి రూ.130 కోట్లకు పైగా ఆదాయం లభించనుంది. అంతేకాదు.. గత భాగస్వామ్య సైకిల్‌తో పోలిస్తే ప్రస్తుత డీల్స్ విలువ 44 శాతం పెరిగినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ పెరుగుదలతో భారత క్రికెట్‌కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, టీమిండియా బ్రాండ్‌కు ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైంది.
వివరాలు
మూడు విభిన్న రంగాల నుంచి..
క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్, చాట్‌జీపీటీ సంస్థలు మూడు వేర్వేరు రంగాలకు చెందినవి. క్యాంపా పానీయాల రంగంలో ఉండగా.. ఎస్‌బీఐ లైఫ్ బీమా రంగానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.
చాట్‌జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో ప్రముఖ బ్రాండ్‌గా ఉంది.
విభిన్న రంగాలకు చెందిన ఈ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశాలు లభిస్తాయని బీసీసీఐ పేర్కొంది.
దేశవ్యాప్తంగా విస్తరించిన భారత క్రికెట్ అభిమాన వర్గాన్ని ఈ బ్రాండ్లు తమ మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
వివరాలు
భారత క్రికెట్‌కు ఉన్న బలానికి నిదర్శనం: మిథున్ మన్హాస్
ఈ భాగస్వామ్యాలపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ సంతోషం వ్యక్తం చేశారు.
భారత స్వదేశీ క్రికెట్ సీజన్ దేశంలో అత్యంత విలువైన, డిమాండ్ ఉన్న క్రీడా వేదికల్లో ఒకటిగా కొనసాగుతోందని అన్నారు.
క్యాంపా,ఎస్‌బీఐ లైఫ్, చాట్‌జీపీటీ వంటి విభిన్న రంగాల సంస్థలు భాగస్వాములుగా రావడం.. భారత క్రికెట్ వ్యవస్థకు ఉన్న బలాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.
గత భాగస్వామ్య సైకిల్‌తో పోలిస్తే తాజా డీల్స్ విలువ 44 శాతం పెరగడం కీలక పరిణామమని మిథున్ మన్హాస్ తెలిపారు.
భారత క్రికెట్‌తో అనుబంధం ద్వారా లభించే విస్తృత రీచ్,అభిమానుల ఆదరణ,వాణిజ్య అవకాశాలపై ప్రముఖ బ్రాండ్లు ఉంచుతున్న విశ్వాసాన్ని ఈ పెరుగుదల ప్రతిబింబిస్తోందన్నారు.
మూడు సంస్థలు తమకు భిన్నమైన బ్రాండ్ లక్ష్యాలతో భాగస్వామ్యంలోకి వచ్చాయని ఆయన చెప్పారు.
వివరాలు
భారత క్రికెట్‌కు పెరుగుతున్న డిమాండ్: సైకియా
వాటితో కలిసి బలమైన భాగస్వామ్యాలను నిర్మించేందుకు బీసీసీఐ ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.
బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా తాజా ఒప్పందాలపై స్పందించారు.
స్వదేశీ క్రికెట్ సీజన్ భాగస్వామ్యాల విలువ గణనీయంగా పెరగడం.. బీసీసీఐ, టీమిండియాపై బ్రాండ్లు ఉంచుతున్న నమ్మకానికి సంకేతమని అన్నారు.
రూ.130 కోట్లకు పైగా విలువైన తాజా ఒప్పందాలతో భాగస్వామ్యాల విలువ 44 శాతం వృద్ధి చెందడం భారత క్రికెట్‌కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోందని దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
తాజా భాగస్వామ్యాలతో పానీయాలు, బీమా, ఏఐ టెక్నాలజీ వంటి విభిన్న రంగాల ప్రముఖ బ్రాండ్లు భారత క్రికెట్‌తో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి.